Lack of Sleep: అర్ధరాత్రి వరకూ నిద్రపోవడం లేదా.. మంచి నిద్ర కోసం ఈ టిప్స్ పాటించి చూడండి

రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం మానసిక స్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చిరాకును కలిగిస్తుంది. ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక ప్రతిరోజూ అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం లేదా సరైన నిద్ర పట్టకపోవడం వల్ల ఎవరి ఆరోగ్యనికైనా ఎలాంటి హాని కలుగుతుందో.. మంచి నిద్ర కోసం ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం..

Lack of Sleep: అర్ధరాత్రి వరకూ నిద్రపోవడం లేదా.. మంచి నిద్ర కోసం ఈ టిప్స్ పాటించి చూడండి
Lack Of Sleep
Follow us

|

Updated on: Apr 29, 2024 | 10:06 AM

మంచి ఆరోగ్యంతో జీవించాలంటే మంచి ఆహారపు అలవాట్లతో పాటు నిద్ర కూడా అవసరం. అయితే మారుతున్న ఆధునిక జీవనశైలిలో అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది. కారణం ఏమైనప్పటికీ. ఇలా అర్ధరాత్రి వరకూ మెలకువగా ఉండడం పని చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. ఈ నిద్ర లేమి .. పేలవమైన నిద్ర విధానం ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కనుక ప్రతిరోజూ 7 నుంఛి 8 గంటల వరకు మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యం. స్క్రీన్‌పై పనిచేయడం లేదా అర్థరాత్రి వరకు ఫోన్ ఉపయోగించడం, రోజూ తొందరగా నిద్రలేచే అలవాటు కారణంగా కొంతమంది ఖాళీ సమయంలో కూడా సమయానికి నిద్రపోలేరు.

రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం మానసిక స్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చిరాకును కలిగిస్తుంది. ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక ప్రతిరోజూ అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం లేదా సరైన నిద్ర పట్టకపోవడం వల్ల ఎవరి ఆరోగ్యనికైనా ఎలాంటి హాని కలుగుతుందో.. మంచి నిద్ర కోసం ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం..

సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే హాని

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ అర్థరాత్రి వరకు మేల్కొని ఉండే అలవాటు ఉంటే అది బరువును పెంచుతుంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది. అంతేకాదు అర్ధరాత్రి వరకూ నిద్రపోకపోతే అది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావితం అవుతుంది. రాత్రి సమయంలో ఎక్కువసేపు మెలకువగా ఉన్నప్పుడు.. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇప్పటికే ఈ సమస్యలను కలిగి ఉన్నవారికి, వారి సమస్యలను మరింత ప్రేరేపించే అవకాశం ఉంటుంది. ఈ నేపధ్యంలో మంచి నిద్ర కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.

రాత్రి సమయంలో తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి

రాత్రి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే అటువంటి ఆహారాన్ని తినాలి. వేయించిన లేదా పిండి పదార్ధాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. రాత్రి భోజనం చేయడానికి, నిద్రపోవడానికి మధ్య దాదాపు 2 గంటల గ్యాప్ ఉండాలని గుర్తుంచుకోండి. అంటే రాత్రి 7 నుండి 8 గంటల మధ్య రాత్రి భోజనం చేయాలి. దీని తర్వాత కొంత సేపు నడవాలి. అనంతరం నిద్రపోవాలి.

పసుపు పాలు ప్రయోజనకరంగా ఉంటాయి

నిద్రపోయే ముందు పసుపు పాలు తీసుకోవడం వలన మంచి నిద్ర వస్తుంది. అయితే ఈ అలవాటు మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగడం వల్ల పిల్లలకు, పెద్దలకు మేలు జరుగుతుంది.

గోరువెచ్చని నీటి, ఆయిల్ తో పాదాలకు మసాజ్

చాలా సార్లు విపరీతమైన అలసట వల్ల కాళ్లలో నొప్పి, వాపు మొదలైన వాటి వల్ల నిద్ర పట్టదు. దీని నుండి ఉపశమనం పొందడానికి పాదాలను గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి, ఆపై వాటిని టవల్‌తో తుడిచి, కొబ్బరి నూనే లేదా ఆలివ్ నూనెతో పాదాలకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన ప్రశాంతమైన నిద్ర లబిస్తుంది.

ప్రాణాయామం చేయడం వల్ల మేలు

దినచర్యలో యోగా చేయడం మంచి ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన నిద్రకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉదయమే అనులోమ్-విలోమ్ వంటి ప్రాణాయామం మీ మనస్సును రిలాక్స్‌గా చేస్తాయి. అంతే కాకుండా శవాసన, బాలాసన చేయడం వల్ల శరీరమంతా రిలాక్స్‌గా ఉండి నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఈ యోగాసనాన్ని రాత్రి పడుకునేటప్పుడు కూడా మంచం మీద హాయిగా చేయవచ్చు.