AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్ని జన్మల పాపమో ఈ కొడుకు.. ఆస్థి కోసం వృద్ధ తండ్రిని దారుణంగా కొట్టి మరణానికి కారణమైన తనయుడు

వైరల్ అవుతున్న వీడియోలో వృద్ధుడు ఇంటి బయట కుర్చీలో కూర్చున్నప్పుడు, కొడుకు వచ్చి అతన్ని కొట్టడం ప్రారంభించాడు. కొడుకు గట్టిగా కొట్టిన దెబ్బలు తాళలేక లేక వృద్ధుడు స్పృహ కోల్పోయాడు. అయినప్పటికీ కొడుకు దీనితో సంతృప్తి చెందలేదు. జన్మనిచ్చిన తండ్రి మీద గౌరవం లేదు సరికదా మనిషి అనే కనికరం లేకుండా తన కాలితో తండ్రి ముఖంపై తన్నినట్లు వీడియోలో చూస్తే తెలుస్తోంది. ఈ వీడియో కర్ణాటకకు చెందినదిగా చెబుతున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

ఎన్ని జన్మల పాపమో ఈ కొడుకు.. ఆస్థి కోసం వృద్ధ తండ్రిని దారుణంగా కొట్టి మరణానికి కారణమైన తనయుడు
Son Beats His Father Brutally
Surya Kala
|

Updated on: Apr 29, 2024 | 12:50 PM

Share

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుడితే ఏమిటి? చస్తే ఏమి అని యోగి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం నేటి తరం యువత అనిపిస్తుంది కొంతమంది చూస్తే ఎవరికైనా.. కొంతమంది కొడుకు తల్లిదండ్రులను చూసే తీరు చూస్తే వీరు కొడుకు కాదు కొరివి అనిపిస్తుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎవరికైనా రక్తం ఉడికిపోతుంది. ఎందుకంటే ఓ యువకుడు తన వృద్ధ తండ్రిని దారుణంగా కొట్టడం కనిపించింది. ఆస్తి కోసం తన తండ్రి వృద్ధుడు అని కూడా చూడకుండా కొడుకు దారుణంగా కొడుతున్నాడు. ఇది చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కొడుకు దెబ్బలు తాళలేక వృద్ధుడు మృతి చెందినట్లు  తెలుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో వృద్ధుడు ఇంటి బయట కుర్చీలో కూర్చున్నప్పుడు, కొడుకు వచ్చి అతన్ని కొట్టడం ప్రారంభించాడు. కొడుకు గట్టిగా కొట్టిన దెబ్బలు తాళలేక లేక వృద్ధుడు స్పృహ కోల్పోయాడు. అయినప్పటికీ కొడుకు దీనితో సంతృప్తి చెందలేదు. జన్మనిచ్చిన తండ్రి మీద గౌరవం లేదు సరికదా మనిషి అనే కనికరం లేకుండా తన కాలితో తండ్రి ముఖంపై తన్నినట్లు వీడియోలో చూస్తే తెలుస్తోంది. ఈ వీడియో కర్ణాటకకు చెందినదిగా చెబుతున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

అత్యంత ఆందోళనకరమైన ఈ వీడియోలో కొడుకు తన వృద్ధ తండ్రిని 15 సెకన్లలో 25 సార్లు కొట్టడం చూడవచ్చు. అలిసిపోయాక తన్నడం మొదలు పెట్టాడు. అయితే, అప్పుడు మరొక వ్యక్తి ఆ కొడుకుని  పట్టుకుని అవతలికి తీసుకుని వెళ్ళాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చాలా మంది ఆ వీడియోను షేర్ చేస్తూ ఇది కలియుగం అంటూ రాసుకున్నారు.

ఇక్కడ వీడియో చూడండి క్రూరమైన కొడుకు తన తండ్రిని దారుణంగా కొట్టాడు.

జార్ఖండ్ బిజెపి నేత డాక్టర్ ధనంజయ్ పుతుష్ ఈ వీడియోను షోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొడుకు కొట్టిన దెబ్బలతో తండ్రి కృంగిపోయాడని .. కొన్ని రోజుల తరువాత మరణించాడని వ్రాసాడు. దీని కంటే అవమానకరమైనది మరొకటి ఉండదు. మరికొందరు పైన ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడని అంటున్నారు. ఈ జన్మలోనే అన్ని లెక్కలు తీరతాయని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..