హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ ట్రిప్.. తక్కువ బడ్జెట్‌లో IRCTC అందిస్తోన్న టూర్ ప్యాకేజీ వివరాలు..

అందమైన థాయిలాండ్ ను చూడాలని తెలుగు వారు కల కంటే హైదరాబాద్ నుంచి వెళ్లే విధంగా  IRCTC ఫ్రెండ్లి బడ్జెట్ లో భాగంగా తక్కువ ధరకే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం మే 09, 2024 తేదీన అందుబాటులో ఉంది. వేసవిలో థాయిలాండ్ చాలా అందమైన ప్రయాణ గమ్యస్థానం. ఈ దేశాలని సందర్శించాలని కలలు కంటూ ఈ అందమైన ప్రదేశాన్ని ఇంకా చూడలేకపోయినట్లయితే..IRCTC ఒక గొప్ప అవకాశాన్ని అందించింది. మే నెలలో ఈ దేశాన్ని సందర్శించవచ్చు.

హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ ట్రిప్.. తక్కువ బడ్జెట్‌లో IRCTC అందిస్తోన్న టూర్ ప్యాకేజీ వివరాలు..
Irctc Thailand Tour
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2024 | 11:13 AM

వేసవి కాలంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి కొంతమంది దేశంలోని వివిధ అందమైన ప్రదేశాలను సందర్శించాలని కోరుకుంటే.. మరికొందరు విదేశాల్లో పర్యటించాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారతీయులు వీసా అవసరం లేకుండా కొన్ని విదేశాలకు వెళ్లవచ్చు. అలాంటి దేశం థాయిలాండ్.  చాలా అందమైన థాయిలాండ్ ను చూడాలని తెలుగు వారు కల కంటే హైదరాబాద్ నుంచి వెళ్లే విధంగా  IRCTC ఫ్రెండ్లి బడ్జెట్ లో భాగంగా తక్కువ ధరకే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్ పేరుతో  ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం మే 09, 2024 తేదీన అందుబాటులో ఉంది.

వేసవిలో థాయిలాండ్ చాలా అందమైన ప్రయాణ గమ్యస్థానం. ఈ దేశాలని సందర్శించాలని కలలు కంటూ ఈ అందమైన ప్రదేశాన్ని ఇంకా చూడలేకపోయినట్లయితే..IRCTC ఒక గొప్ప అవకాశాన్ని అందించింది. మే నెలలో ఈ దేశాన్ని సందర్శించవచ్చు. అది కూడా సామాన్యుడికి అందుబాటులో ఉన్న బడ్జెట్‌లోనే. ఈ రోజు ప్యాకేజీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ప్యాకేజీ పేరు- ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్

ప్యాకేజీ వ్యవధి- 3 రాత్రులు, 4 రోజులు

ప్రయాణ విధానం- ఫ్లైట్

మొదటి రోజు జర్నీ: మే 09వ తేదీ రాత్రి 09 గంటలకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈ టూర్ జర్నీ మొదలు అవుతుంది. శంషాబాద్ నుంచి పట్టాయాకు చేరుకుంటారు. రాత్రికి పట్టాయాలోనే బస చేస్తారు.

రెండో రోజు జర్నీ: ఉదయం ఇండియన్ లాంచ్ లో ఐల్యాండ్ కు అక్కడ నుంచి నాంగ్ నుచ్ ట్రాఫికల్ గార్డెన్ కు వెళ్తారు. అక్కడ లంచ్ చేసి పట్టాయాలోని వివిధ అందమైన ప్రదేశాలను చూడవచ్చు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు.

మూడో రోజు జర్నీ: ఉదయం సఫారీ, మెరైన్ పార్క్ వంటి వాటిని సందర్శించి.. అక్కడ నుంచి మధ్యాహ్నం పట్టాయా నుంచి బ్యాంకాక్ కు వెళ్లారు. ఇక్కడ ఉన్న పర్యాటక ప్రాంతాలను చూస్తారు.

నాలుగో రోజు జర్నీ: బ్యాంకాక్ సిటీలోని ఆలయాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. తిరిగి  సాయంత్రం 6 గం. బ్యాంకాక్ ఎయిర్ పోర్టుకు చేరుకుని హైదరాబాద్ కు  బయలుదేరతారు.

ప్యాకేజీ లోని సదుపాయాలు:

1 . విమాన టిక్కెట్లు ప్యాకేజీలో అందుబాటులో ఉంటాయి.

2 . బస చేసేందుకు 3 స్టార్ హోటల్ సౌకర్యం ఉంటుంది.

3 . అల్పాహారం నుంచి మధ్యాహ్నం,  రాత్రి భోజనం వరకు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

4 . మీరు ప్రయాణ బీమా సౌకర్యం కూడా పొందుతారు.

ప్యాకేజీలో టికెట్ ధరలు

1 . ఈ ట్రిప్‌లో సింగిల్ అక్యుపెన్సీకి రూ. 57,415 చెల్లించాలి.

2 . ఇద్దరు వ్యక్తులు అయితే ఒక్కొక్కరికి రూ.49,040 చెల్లించాల్సి ఉంటుంది.

3 . ఒక్కొక్కరికి రూ.49,040 చొప్పున ముగ్గురు వ్యక్తులు చెల్లించాల్సి ఉంటుంది.

పిల్లలకు టికెట్ ధరలు వేర్వేరుగా చెల్లించాల్సి ఉంది. బెడ్‌తో రూ.47,145, బెడ్ లేకుండా రూ.42,120 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు IRCTC ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది

IRCTC ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్‌ను షేర్ చేసింది. ఇందులో మీరు థాయిలాండ్ లోని అందమైన దృశ్యాలను చూడాలనుకుంటే  మీరు IRCTC అందిస్తోన్న ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు.

ఎలా బుక్ చేసుకోవాలంటే

మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..