13 ఏళ్లు కోమాలో ఉన్న వ్యక్తి.. కోలుకున్న తర్వాత అతను చెప్పిన కథ వింటే కన్నీరు పెట్టాల్సిందే..

వృత్తిరీత్యా వెబ్ డెవలపర్ అయిన మార్టిన్ వయస్సు ఇప్పుడు 49 సంవత్సరాలు. అతను 12 సంవత్సరాల వయస్సులో అతను ఒక మర్మమైన వ్యాధి బారిన పడ్డాడు. కోమాలోకి వెళ్ళాడు. మొదట గొంతు నొప్పి వచ్చింది. తర్వాత ఆహారం తినలేకపోయాడు. కనీసం నీరు కూడా తాగలేకపోయాడు. తర్వాత మార్టిన్ నిరంతరం అంటే రోజుల తరబడి నిద్రపోయేవాడు. మాట్లాడటం కూడా మానేశాడు. అయితే ఇక్కడ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బాలుడు రెండేళ్ల తర్వాత అతను కోమా నుండి మేల్కొన్నాడు.

13 ఏళ్లు కోమాలో ఉన్న వ్యక్తి.. కోలుకున్న తర్వాత అతను చెప్పిన కథ వింటే కన్నీరు పెట్టాల్సిందే..
Martin Was Locked In A Coma For 13 YearsImage Credit source: martinpistorius
Follow us

|

Updated on: Apr 29, 2024 | 12:30 PM

దేవుడు, సైన్స్ మధ్య ఎప్పుడూ ఒక నమ్మకం వాదన జరుగుతూ ఉంటుంది. వైద్య శాస్త్రానికి సంబంధించిన రకరకాల కథలు వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని సంఘటలు వింటే అమ్మో ఇవి నిజమేనా అంటూ భావోద్వేగానికి గురవుతారు. ఇలాంటి ఒక వింత ఘటన ఒకటి వెలుగులోకి వచ్చి అందరికీ షాక్ ఇస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన మార్టిన్‌ పిస్టోరియస్‌ కు సంబంధించిన హృదయ విదారక కథ ఇది. చిన్నతనంలోనే వింత వ్యాధి బారిన పడి 13 ఏళ్లపాటు కోమాలో ఉన్న ఓ వ్యాధి బారిన పడిన వ్యక్తీ కథ ఇది. మార్టిన్‌ పిస్టోరియస్‌ ఏమీ మాట్లాడలేనంతగా, కాళ్లు చేతులు కదపలేనంతగా, కళ్లలో కదలిక లేని పరిస్థితి ఏర్పడింది. అయితే తన 12 ఏళ్ల కొడుక్కి ఏదో దెయ్యం పట్టిందని తల్లి భావించింది. కుమారుడి బాధాకరమైన పరిస్థితిని చూసి తల్లి తల్లడింది. కొడుక్కి తెలియకుండా రహస్యంగా కన్నీరు పెట్టుకుంది. అంతే కాదు కొడుకు బాధ చూడలేకపోయిన ఆ తల్లి తన కొడుకు మరణం కోసం ప్రార్థించడం కూడా ప్రారంభించింది.

వృత్తిరీత్యా వెబ్ డెవలపర్ అయిన మార్టిన్ వయస్సు ఇప్పుడు 49 సంవత్సరాలు. అతను 12 సంవత్సరాల వయస్సులో అతను ఒక మర్మమైన వ్యాధి బారిన పడ్డాడు. కోమాలోకి వెళ్ళాడు. మొదట గొంతు నొప్పి వచ్చింది. తర్వాత ఆహారం తినలేకపోయాడు. కనీసం నీరు కూడా తాగలేకపోయాడు. తర్వాత మార్టిన్ నిరంతరం అంటే రోజుల తరబడి నిద్రపోయేవాడు. మాట్లాడటం కూడా మానేశాడు. అయితే ఇక్కడ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బాలుడు రెండేళ్ల తర్వాత అతను కోమా నుండి మేల్కొన్నాడు. అయితే అతని శరీరం ఇంకా నిద్రావస్థ నుంచి మేల్కొనలేదు.

ఇవి కూడా చదవండి

LadBible నివేదిక ప్రకారం కోమా నుంఛి మేల్కొన్న మార్టిన్ ప్రతిదీ అర్థం చేసుకోగలిగాడు. తన కుటుంబ సభ్యుల సంభాషణలను వినేవాడు. అయితే తాను కోమా నుండి తిరిగి వచ్చానని తన తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడు. దీంతో కొడుకుకు దెయ్యం పట్టిందని తల్లి భావించింది. కుమారుడి పరిస్థితిని చూసిన తల్లి తనను తాను నియంత్రించుకోలేక అతని మరణం కోసం ప్రార్థించడం ప్రారంభించింది.

మార్టిన్ క్రిప్టోకోకల్ మెనింజైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు భావించారు. ఆ సమయంలో ఈ వ్యాధికి చికిత్స లేదు. మార్టిన్‌ను ఇంటికి తీసుకెళ్లి అతనిని చూసుకోవాలని, బాలుడి మరణం కోసం వేచి ఉండమని మార్టిన్ తల్లిదండ్రులకు డాక్టర్లు చెప్పారు. ఇంతకంటే వేరే మార్గం లేదని దేవునిపై భారం వేశారు.

అయితే మార్టిన్ అందరికి షాక్ ఇస్తూ పూర్తిగా కోమా నుంచి బయటకు వచ్చాడు. తమ కొడుకుని చూసి తల్లిదండ్రులు సంతోషపడ్డారు. అయితే దీని తర్వాత మార్టిన్ చెప్పిన కథ అందరినీ కదిలించింది. పగటిపూట తనను కేర్ సెంటర్‌కు పంపినప్పుడు.. అక్కడ ఉన్న సిబ్బందితో సమయం గడపాల్సి వచ్చేదని, వారు తనను దుర్భాషలాడడమే కాదు తనను చాలా హింసించేవారని అతను చెప్పాడు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

కేర్ సెంటర్ సిబ్బంది నోటిలో బలవంతంగా ఆహారాన్ని నింపేవారని తెలిపారు. తన జుట్టును గట్టిగా లాగేవారని నొప్పికి కళ్లలో నీళ్లు వచ్చేవని చెప్పారు. వేడి టీ తాగమని తనను బలవంతం చేసేవారని.. తాగలేకపోతే కొట్టేవాడని చెప్పాడు. అవి చాలా భయానక క్షణాలు అని మార్టిన్ చెప్పాడు. అప్పుడు తాను చనిపోతే మంచిదని.. చావుకోసం ఎదురుచూసే వాడినని కోరుకునే వాడినని చెప్పాడు. ముఖ్యంగా తన సంరక్షణ బాధ్యత వహించే మహిళ మార్టిన్‌ను శారీరకంగా హింసించిందని చెప్పాడు. అంతేకాదు తన ఆరోగ్య పరిస్థితి, మనుషులు చేసిన పనులు తెలియజేస్తూ జీవిత చరిత్రపై ‘ఘోస్ట్ బాయ్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..