వామ్మో.! చేపల కోసం వల వేస్తే.. గాలానికి చిక్కిన పొడవాటి ఆకారం చూసి జాలరి స్టన్..
అదృష్టం ఎప్పుడు.. ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరం చెప్పలేం..! ఎంతోమంది ఓవర్‌నైట్‌లోనే అదృష్టవంతులు కావడం మనం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఈ కోవకే చెందాడు ఓ మత్స్యకారుడు. ఇంతకీ అసలేం చిక్కింది.. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. మరి లేట్ ఎందుకు.!

అదృష్టం ఎప్పుడు.. ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరం చెప్పలేం..! ఎంతోమంది ఓవర్‌నైట్‌లోనే అదృష్టవంతులు కావడం మనం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఈ కోవకే చెందాడు ఓ మత్స్యకారుడు. చిలీలో నివసిస్తున్న ఓ జాలరికి అదృష్టం వరించింది. చేపల కోసం నదిలో వల వేయగా.. గాలానికి చిక్కింది చూసి దెబ్బకు స్టన్ అయ్యాడు. వందేళ్లుగా శాస్త్రవేత్తలు ఆ చేప గురించి శోధిస్తుంటే.. ఈ జాలరికి అది చిక్కడం అతడి అదృష్టం. యూరోపియన్ జర్నల్ ఆఫ్ టాక్సానమీ ప్రచురించిన కథనం ప్రకారం.. రోజూలానే చిలీలోని శాంటియాగోలో మత్స్యకారులు యథావిధిగా చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లారు. ఆ సమయంలో వారి వలలో ‘షార్క్’ చిక్కింది. వల పైకి లాగి చూడగా..! అవి చేపల్లాగ కనిపించకపోవడంతో.. మొదట జాలర్లు కొంచెం అయోమయంలో పడ్డారు. ఆ తర్వాత ఒడ్డుకు చేరుకొని సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని తమ వలకు చిక్కింది సొరచేప కాదని.. ఏంజెల్ షార్క్ అని జాలర్లకు వివరించారు.
ఈ చేప ప్రత్యేకత ఏమిటి?
చాలా ఏళ్ల క్రితం తప్పిపోయిన ‘ఏంజెల్ షార్క్’ ఇదని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తేల్చారు. దీని పొడవు కేవలం 3 అడుగుల మాత్రమేనని.. ఈ ఏంజెల్ షార్క్ శరీరం ఇతర సొరచేపల వలె చదునుగా ఉంది. వెనుక భాగంలో ముళ్లు ఉంటాయన్నారు. తలపై చిన్న, పదునైన హుక్ కారణంగా ఇది చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించారు. ఈ ఏంజెల్ షార్క్.. ఇతరుల సొరచేపల నుంచి తప్పించుకుని దాక్కోవడంలో.. అలాగే ఆకస్మికంగా దాడి చేయడంలోనూ ముందుంటుంది. ఈ ప్రత్యేకమైన చేప తన జీవితమంతా ఇసుక, బురదలో ఉంటుంది. అందుకే దీనిని ఇసుక దెయ్యం అని కూడా పిలుస్తుంటారు. సాధారణంగా ఇలాంటి జాతికి చెందిన పెద్ద సొరచేప దాదాపు ఐదు అడుగుల పొడవు ఉంటుందని, 25 నుంచి 35 ఏళ్ల పాటు హాయిగా జీవించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

