Viral Video: పొదల మాటున వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా దెబ్బకు గుండె ధడేల్.!
పాము, ముంగీసలు బద్దశత్రువులు. ఇది జగమెరిగిన సత్యం. వాటి శత్రుత్వం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తోంది ఈ పగ.. పాము, ముంగీస రెండూ ఒకదానికి ఒకటి తారసపడితే.. బాహుబలి, భల్లాలదేవ రేంజ్‌లో పెద్ద యుద్ధం జరిగినట్లే. రెండూ కూడా భీకరంగా పోరాడుతాయి. ఆ వీడియో చూసేయండి..

పాము, ముంగీసలు బద్దశత్రువులు. ఇది జగమెరిగిన సత్యం. వాటి శత్రుత్వం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తోంది ఈ పగ.. పాము, ముంగీస రెండూ ఒకదానికి ఒకటి తారసపడితే.. బాహుబలి, భల్లాలదేవ రేంజ్‌లో పెద్ద యుద్ధం జరిగినట్లే. రెండూ కూడా భీకరంగా పోరాడుతాయి. పాము ఎంత విషపూరితమైనదైనా.. ముంగీస దాని అంతుచూసేవరకు వదిలిపెట్టదు. అలాంటిది ఓ పే..ద్ద కొండచిలువపైకి 20 అంతకంటే ఎక్కువ ముంగీసలు ఒక్కసారిగా మీదదిపోతే.. నిజమండీ.! బాబూ.. అసలేం జరిగిందంటే ఓ కొండచిలువను 20కి పైగా ముంగీసలు చుట్టుముట్టాయి. అన్ని కలిపి ఆ కొండచిలువపై ఊపిరి పీల్చుకోనంతగా దాడి చేశాయి. ఆ దాడి అలాంటిది.. ఇలాంటిది కాదు.. కచ్చితంగా ఈ ముంగీసల దాడికి పైథాన్ ప్రాణాలు కోల్పోయినట్టే. కానీ ఇక్కడే కథలో ఓ పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఆఖర్లో ఏమైందో.. ఏమో గానీ ఆ ముంగీస పగ చల్లారినట్టు ఉంది.. దెబ్బకు ఆ కొండచిలువను వదిలిపెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని మార్లోత్ పార్క్‌లో జరిగింది. ఇద్దరు టూరిస్టులు ఈ వీడియోను రికార్డు చేశారు. మొదటిగా వారికి పొదల్లో నుంచి వింత శబ్దాలు రావడంతో.. అటు ఏం జరుగుతోందని టార్చ్ వేసి చూడగా.. 20కి పైగా ముంగీసలు కొండచిలువపై దాడి చేసినట్టు కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ ట్రెండింగ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి.
