తొండంతో చేతి పంపు కొట్టి.. తన గార్డ్ దాహం తీర్చిన ఏనుగు

తొండంతో చేతి పంపు కొట్టి.. తన గార్డ్ దాహం తీర్చిన ఏనుగు

Phani CH

|

Updated on: Apr 29, 2024 | 1:55 PM

అసలే వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. ఇటు మనుషులే కాకుండా మూగజీవాలు కూడా వేసవిలో నీటికోసం అల్లాడుతాయి. ఈ క్రమంలో అడవుల్లో ఆహారం నీరు దొరక్క వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. తాజాగా ఓ ఏనుగు వేసవి తాపంతో అల్లాడుతున్న తన యజమానికి చేతిపంపును కొట్టి అతని దాహార్తిని తీర్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకా కమలాపూర్ లోని ఏనుగుల పార్కులో ఓ ఏనుగు తన గార్డును అనుకరిస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అసలే వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. ఇటు మనుషులే కాకుండా మూగజీవాలు కూడా వేసవిలో నీటికోసం అల్లాడుతాయి. ఈ క్రమంలో అడవుల్లో ఆహారం నీరు దొరక్క వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. తాజాగా ఓ ఏనుగు వేసవి తాపంతో అల్లాడుతున్న తన యజమానికి చేతిపంపును కొట్టి అతని దాహార్తిని తీర్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకా కమలాపూర్ లోని ఏనుగుల పార్కులో ఓ ఏనుగు తన గార్డును అనుకరిస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పార్కులోని చేతిపంపును ఏనుగు తొండంతో కొడుతుండగా.. గార్డు సుదీప్ నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు. అచ్చం మనుషుల్లాగానే తొండంతో చేతి పంపు హ్యాండిల్‌ను కొడుతూ దాహం తీర్చిన ఏనుగుకు పలువురు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొబ్బరి బోండం రేటు చూస్తేనే.. వడదెబ్బ తగిలినట్టు ఉంటోంది

భారీగా తగ్గుతున్న ఫారెక్స్‌ నిల్వలు.. మరోవైపు పెరుగుతున్న పసిడి రిజర్వులు

తెలంగాణ వైపు దూసుకొస్తున్న ఏనుగుల గుంపు..

మిస్‌ యూనివర్స్‌గా 60 ఏళ్ల బామ్మ !! ఆమె అందం చూస్తే..