భారీగా తగ్గుతున్న ఫారెక్స్ నిల్వలు.. మరోవైపు పెరుగుతున్న పసిడి రిజర్వులు
దేశంలో విదేశీ మారకం నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ఈమేరకు భారతీయ రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో కీలక అంశాలను ప్రస్తావించింది. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.82 బిలియన్ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది. అంతకుముందు వారంలో ఈ నిల్వలు 5.401 బిలియన్ డాలర్లు తరిగిపోయాయి.
దేశంలో విదేశీ మారకం నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ఈమేరకు భారతీయ రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో కీలక అంశాలను ప్రస్తావించింది. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.82 బిలియన్ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది. అంతకుముందు వారంలో ఈ నిల్వలు 5.401 బిలియన్ డాలర్లు తరిగిపోయాయి. సెప్టెంబర్ 2021లో రికార్డు స్థాయిలో 642.453 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ గరిష్ఠ స్థాయిని అధిగమించాయి. మరోవైపు పసిడి రిజర్వులు పెరుగుతున్నాయి. తాజాగా 1.01 బిలియన్ డాలర్లమేర బంగారు రిజర్వులు పెరిగి 56.808 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇటు రూపాయి విలువ పడిపోతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos