టైటానిక్’ సంపన్న ప్రయాణికుడి వాచ్ కు వేలం.. భారీ ధరకు కొన్న ఔత్సాహికుడు

టైటానిక్ షిప్ ప్రమాదం గురించి తెలుసుగా.. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో నిండిన ఈ ఓడ భారీ మంచు పలకను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. అందులో ప్రయాణించిన నాటి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెరికా బిజినెస్ మ్యాగ్నెట్ జాన్ జేకబ్ ఆస్టర్ కూడా ఈ ప్రమాదంలో మృతిచెందారు. అయితే అప్పుడు ఆయన చేతికి ఉన్న బంగారు వాచ్ ను తాజాగా ఇంగ్లాండ్ లో వేలం వేశారు. దీనికి రికార్డు స్థాయిలో ధర పలికింది.

టైటానిక్’ సంపన్న ప్రయాణికుడి వాచ్ కు వేలం.. భారీ ధరకు కొన్న ఔత్సాహికుడు

|

Updated on: Apr 29, 2024 | 2:13 PM

టైటానిక్ షిప్ ప్రమాదం గురించి తెలుసుగా.. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో నిండిన ఈ ఓడ భారీ మంచు పలకను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. అందులో ప్రయాణించిన నాటి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెరికా బిజినెస్ మ్యాగ్నెట్ జాన్ జేకబ్ ఆస్టర్ కూడా ఈ ప్రమాదంలో మృతిచెందారు. అయితే అప్పుడు ఆయన చేతికి ఉన్న బంగారు వాచ్ ను తాజాగా ఇంగ్లాండ్ లో వేలం వేశారు. దీనికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఏకంగా 1.46 మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ. 12.17 కోట్లకు అమ్ముడుపోయింది. వాచ్ ను వేలం వేసిన సంస్థ హెన్రీ ఆల్డ్ రిడ్జ్ అండ్ సన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వాచ్ కు వేలంలో లక్ష పౌండ్ల నుంచి లక్షన్నర పౌండ్ల వరకు అంటే సుమారు రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకు రావొచ్చని నిర్వాహకులు అంచనా వేశారు. అయితే అమెరికాకు చెందిన ఓ ఔత్సాహికుడు వారి అంచనాలను పటాపంచలను చేస్తూ ఇంత భారీ ధరకు దాన్ని కొనుగోలు చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్ లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి .. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్‌

కొత్త రకం బ్లడ్‌ టెస్ట్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా ??

మాజీ మంత్రి ఇంట్లో చోరీకి యత్నం.. చివరికి ??

తొండంతో చేతి పంపు కొట్టి.. తన గార్డ్ దాహం తీర్చిన ఏనుగు

కొబ్బరి బోండం రేటు చూస్తేనే.. వడదెబ్బ తగిలినట్టు ఉంటోంది

Follow us