మాజీ మంత్రి ఇంట్లో చోరీకి యత్నం.. చివరికి ??
ఒంగోలులో మాజీ మంత్రి, వైసిపి నేత శిద్దా రాఘవరావు ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాల సమయంలో గోడదూకి ఇద్దరు దొంగలు శిద్దా రాఘవరావు ఇంట్లోకి ప్రవేశించారు. కింద పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న వరండాలో వాచ్‌మెన్ కుర్చీలో కూర్చుని సెల్‌ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా లోపలికి ప్రవేశించిన దొంగలు వాచ్‌మెన్‌పై ఎటాక్ చేశారు. కత్తితో బెదిరించి నోరు నొక్కి అరవకుండా చేయడంతో భయపడిపోయిన వాచ్‌మెన్ పెనుగులాడే క్రమంలో కుర్చీ నుంచి కిందపడిపోయాడు
ఒంగోలులో మాజీ మంత్రి, వైసిపి నేత శిద్దా రాఘవరావు ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాల సమయంలో గోడదూకి ఇద్దరు దొంగలు శిద్దా రాఘవరావు ఇంట్లోకి ప్రవేశించారు. కింద పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న వరండాలో వాచ్‌మెన్ కుర్చీలో కూర్చుని సెల్‌ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా లోపలికి ప్రవేశించిన దొంగలు వాచ్‌మెన్‌పై ఎటాక్ చేశారు. కత్తితో బెదిరించి నోరు నొక్కి అరవకుండా చేయడంతో భయపడిపోయిన వాచ్‌మెన్ పెనుగులాడే క్రమంలో కుర్చీ నుంచి కిందపడిపోయాడు. వాచ్‌మెన్ పెద్దగా కేకలు వేయడంతో అక్కడే పడుకుని ఉన్న గన్‌మెన్ నిద్ర లేచాడు. దాంతో దొంగలు అక్కడినుంచి పరారయ్యారు. సమయానికి గాడ్ మేల్కొని దొంగలను తరమడంతో వాచ్‌మెన్ సురక్షితంగా బయటపడ్డాడు. అతనికి పెద్దగా గాయాలేమీ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తొండంతో చేతి పంపు కొట్టి.. తన గార్డ్ దాహం తీర్చిన ఏనుగు
కొబ్బరి బోండం రేటు చూస్తేనే.. వడదెబ్బ తగిలినట్టు ఉంటోంది
భారీగా తగ్గుతున్న ఫారెక్స్ నిల్వలు.. మరోవైపు పెరుగుతున్న పసిడి రిజర్వులు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

