తన రూపంపై ట్రోలర్ల నోరు మూయించిన యూపీ టెన్త్ టాపర్
ఉత్తరప్రదేశ్ పదో తరగతి బోర్డు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ప్రాచీ నిగమ్ 98.5 శాతం మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచింది. దీంతో నెట్టింట ఆమె ఫొటో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఆమె ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టారు. మరికొందరు మాత్రం ఆమె సాధించిన మార్కులను అభినందిస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు.ఈ అంశంపై ప్రాచీ నిగమ్ తాజాగా స్పందించింది.
ఉత్తరప్రదేశ్ పదో తరగతి బోర్డు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ప్రాచీ నిగమ్ 98.5 శాతం మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచింది. దీంతో నెట్టింట ఆమె ఫొటో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఆమె ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టారు. మరికొందరు మాత్రం ఆమె సాధించిన మార్కులను అభినందిస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు.ఈ అంశంపై ప్రాచీ నిగమ్ తాజాగా స్పందించింది. తన రూపాన్ని చూసి సోషల్ మీడియాలో ఎగతాళి చేసిన ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. అంతిమంగా లెక్కలోకి వచ్చేది మార్కులే కానీ ఆహార్యం కాదని వారి నోరు మూయించింది. సోషల్ మీడియా వేదికగా తనపై జరిగిన ట్రోలింగ్ పెద్దగా బాధించలేదనీ అంతిమంగా మార్కులే ముఖ్యమనీ ప్రాచీ పోస్ట్ పెట్టింది. చాణక్యుడిని కూడా ఆయన ఆహార్యం చూసి కొందరు ఎగతాళి చేశారనీ… కానీ అది ఆయన్ను ఏమాత్రం ప్రభావితం చేయలేదని ప్రాచీ నిగమ్ గుర్తుచేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైటానిక్’ సంపన్న ప్రయాణికుడి వాచ్ కు వేలం.. భారీ ధరకు కొన్న ఔత్సాహికుడు
గూగుల్ లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి .. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్
కొత్త రకం బ్లడ్ టెస్ట్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా ??