కొత్త రకం బ్లడ్ టెస్ట్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా ??
ఇటీవలి కాలంలో చాలా మంది కీళ్ల నొప్పుల వ్యాధి ‘ఆస్టియో ఆర్థరైటిస్’ బారిన పడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహారం, ఇతర అంశాలు దీనికి కారణమవుతున్నాయి. అయితే దీనిని ముందే గుర్తిస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే ప్రత్యేకమైన ఎక్స్ రే ల ద్వారా ‘ఆస్టియో ఆర్థరైటిస్’ వచ్చే అవకాశాన్ని కాస్త ముందుగా గుర్తించేందుకు వీలుంది. అలాకాకుండా.. సమస్య ఇంక మొదలు కాకుండానే ఆ సమస్య వచ్చే అవకాశం ఎంతవరకూ ఉందో తెలుసుకునేలా బ్లడ్ టెస్ట్ విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు
ఇటీవలి కాలంలో చాలా మంది కీళ్ల నొప్పుల వ్యాధి ‘ఆస్టియో ఆర్థరైటిస్’ బారిన పడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహారం, ఇతర అంశాలు దీనికి కారణమవుతున్నాయి. అయితే దీనిని ముందే గుర్తిస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే ప్రత్యేకమైన ఎక్స్ రే ల ద్వారా ‘ఆస్టియో ఆర్థరైటిస్’ వచ్చే అవకాశాన్ని కాస్త ముందుగా గుర్తించేందుకు వీలుంది. అలాకాకుండా.. సమస్య ఇంక మొదలు కాకుండానే ఆ సమస్య వచ్చే అవకాశం ఎంతవరకూ ఉందో తెలుసుకునేలా బ్లడ్ టెస్ట్ విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఎనిమిదేళ్లు ముందే వ్యాధి గురించి తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఆస్టియో ఆర్థరైటిస్ పై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు.. 200 మంది మహిళల నుంచి పదేళ్ల పాటు తరచూ రక్తం శాంపిల్స్ తీసుకుని పరిశీలించారు. వారి వయసు, శరీర బరువు ఆధారంగా వివరాలను వేరుచేశారు. ఈ మహిళల్లో కొందరు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య బారిన పడటంతో.. వారి రక్తంలోని ఏయే ప్రొటీన్ల స్థాయుల్లో తేడాలు వచ్చాయో తేల్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాజీ మంత్రి ఇంట్లో చోరీకి యత్నం.. చివరికి ??
తొండంతో చేతి పంపు కొట్టి.. తన గార్డ్ దాహం తీర్చిన ఏనుగు
కొబ్బరి బోండం రేటు చూస్తేనే.. వడదెబ్బ తగిలినట్టు ఉంటోంది
భారీగా తగ్గుతున్న ఫారెక్స్ నిల్వలు.. మరోవైపు పెరుగుతున్న పసిడి రిజర్వులు