గూగుల్ లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి .. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్‌

ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్, ఆల్ఫాబెట్ లకు సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ తాను సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2004లో గూగుల్ లో ప్రోడక్ట్ మేనేజర్ గా చేరినప్పటి నుంచి తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచి ఇప్పటివరకు తన 20 ఏళ్ల సర్వీసులో సంస్థలో ఎన్నో మార్పులు జరిగాయని పేర్కొన్నారు.

గూగుల్ లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి .. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్‌

|

Updated on: Apr 29, 2024 | 2:12 PM

ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్, ఆల్ఫాబెట్ లకు సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ తాను సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2004లో గూగుల్ లో ప్రోడక్ట్ మేనేజర్ గా చేరినప్పటి నుంచి తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచి ఇప్పటివరకు తన 20 ఏళ్ల సర్వీసులో సంస్థలో ఎన్నో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 2004 ఏప్రిల్ 26.. గూగుల్ లో నా తొలి రోజు. అప్పటినుంచి ఇప్పటివరకూ సంస్థ ఎంతో మారింది. సాంకేతికత, మా ఉత్పత్తులు ఉపయోగించే ప్రజల సంఖ్యతో పాటు, నా జుట్టు కూడా మారిపోయింది. కానీ ఈ గొప్ప కంపెనీలో పని చేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం మారలేదు. 20 ఏళ్లు గడిచిపోయాయి.. నన్ను నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నా అంటూ సుందర్ పిచాయ్ తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. 20 అంకె ఆకారంలో ఉన్న రెండు బెలూన్లు, లావా విరజిమ్ముతున్నట్లుగా దీపం ఆకారంలోని జ్ఞాపిక, తన తొలి, ప్రస్తుత ఐడీ కార్డుల ఫొటోలను తన పోస్టుకు జత చేశారు. ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త రకం బ్లడ్‌ టెస్ట్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా ??

మాజీ మంత్రి ఇంట్లో చోరీకి యత్నం.. చివరికి ??

తొండంతో చేతి పంపు కొట్టి.. తన గార్డ్ దాహం తీర్చిన ఏనుగు

కొబ్బరి బోండం రేటు చూస్తేనే.. వడదెబ్బ తగిలినట్టు ఉంటోంది

భారీగా తగ్గుతున్న ఫారెక్స్‌ నిల్వలు.. మరోవైపు పెరుగుతున్న పసిడి రిజర్వులు

Follow us
Latest Articles
అందం దైవ వరం పొందిందేమో.. ఈ వయ్యారి హృదయాన బందీ అయింది..
అందం దైవ వరం పొందిందేమో.. ఈ వయ్యారి హృదయాన బందీ అయింది..
హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో నిబంధనలు మార్పు.. ప్రీమియం పెంపు
హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో నిబంధనలు మార్పు.. ప్రీమియం పెంపు
రసవత్తరంగా లోక్‌సభ ఎన్నికలు.. స్టార్ నటుడు పవన్‌పై తల్లి పోటీ!
రసవత్తరంగా లోక్‌సభ ఎన్నికలు.. స్టార్ నటుడు పవన్‌పై తల్లి పోటీ!
భారమంతా డబుల్ ఇస్మార్ట్‌పైనే.. ఆ ముగ్గురి కెరీర్స్‌కు అగ్నిపరీక్ష
భారమంతా డబుల్ ఇస్మార్ట్‌పైనే.. ఆ ముగ్గురి కెరీర్స్‌కు అగ్నిపరీక్ష
ఒడియమ్మ బడవా.. కారులో హెల్మెట్ పెట్టుకోలేదట.. కట్ చేస్తే..
ఒడియమ్మ బడవా.. కారులో హెల్మెట్ పెట్టుకోలేదట.. కట్ చేస్తే..
సీరియల్‌లో సాఫ్ట్.. బయట మాత్రం బీభత్సం
సీరియల్‌లో సాఫ్ట్.. బయట మాత్రం బీభత్సం
మీ ఐ ఫోకస్ కిర్రాకేనా.! ఈ ఫోటోలో '3' నెంబర్ ఎక్కడుందో చెప్పగలరా.?
మీ ఐ ఫోకస్ కిర్రాకేనా.! ఈ ఫోటోలో '3' నెంబర్ ఎక్కడుందో చెప్పగలరా.?
మీరు ఇంట్లో ఎంత ఆల్కహాల్ నిల్వ ఉంచుకోవచ్చు? నియమాలు ఏమిటి?
మీరు ఇంట్లో ఎంత ఆల్కహాల్ నిల్వ ఉంచుకోవచ్చు? నియమాలు ఏమిటి?
బ్రిటన్ ఎన్నికల్లో.. కరీంనగర్ జిల్లా వాసి.. ఆ పార్టీ నుంచి బరిలో
బ్రిటన్ ఎన్నికల్లో.. కరీంనగర్ జిల్లా వాసి.. ఆ పార్టీ నుంచి బరిలో
హింసాత్మక ఘటనలపై సీఎస్, డీజీపీని వివరణ కోరిన ఈసీ..
హింసాత్మక ఘటనలపై సీఎస్, డీజీపీని వివరణ కోరిన ఈసీ..