AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్.. ఖర్గేను గెలిపించమని పిలుపు..

కర్ణాటకలోని గుర్మిట్కల్ లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా మల్లిఖార్జున ఖర్గే గెలిచారు. 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే.. ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్.. ఖర్గేను గెలిపించమని పిలుపు..
Cm Revanth Reddy
Srikar T
|

Updated on: Apr 29, 2024 | 2:35 PM

Share

కర్ణాటకలోని గుర్మిట్కల్ లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా మల్లిఖార్జున ఖర్గే గెలిచారు. 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే.. ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ప్రజలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐదు గ్యారంటీలను కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసిందన్నారు. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామన్నారు. పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామన్న మోదీ మాట తప్పారన్నారు. 40కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ.. ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదన్నారు.

కర్ణాటక నుంచి 26ఎంపీలను ఇస్తే.. మోదీ కర్ణాటకకు కేవలం ఒకటే కేబినెట్ పదవి ఇచ్చారన్నారు. మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదు.. ఖాళీ చెంబు తప్ప అని ఎద్దేవా చేశారు. కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అలాంటి మోదీని ఓడించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్‎ను గెలిపించుకోవాలని సూచించారు. ఇక్కడ కాంగ్రెస్‎కు ఒక్క ఓటు వేస్తే.. ముగ్గురు నాయకులు మీకు సేవ చేస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‎కు ఓటు వేయండన్నారు సీఎం రేవంత్. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‎ను లక్ష మెజారిటీతో గెలిపించండని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..