Periods Pain: ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!

పీరియడ్స్ అనగానే చాలా మంది మహిళల్లో అసంతృప్తి, చిరాకు మొదలవుతాయి. పీరియడ్స్ అనేవి అందరిలోనూ ఒకేలా ఉండవు. కొందరిలో భరించలేనంత నొప్పి, కాళ్లు తిమ్మిర్లు కూడా ఉంటాయి. ఈ సమయంలో ఏ పనీ చేయాలనిపించదు. చాలా రకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ నొప్పిని భరించలేక చాలా మంది ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి కారణంగా భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని హోమ్ మేడ్ టిప్స్‌ను పాటించడం వల్ల..

Periods Pain: ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!
Periods
Follow us

|

Updated on: Apr 30, 2024 | 7:47 PM

పీరియడ్స్ అనగానే చాలా మంది మహిళల్లో అసంతృప్తి, చిరాకు మొదలవుతాయి. పీరియడ్స్ అనేవి అందరిలోనూ ఒకేలా ఉండవు. కొందరిలో భరించలేనంత నొప్పి, కాళ్లు తిమ్మిర్లు కూడా ఉంటాయి. ఈ సమయంలో ఏ పనీ చేయాలనిపించదు. చాలా రకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ నొప్పిని భరించలేక చాలా మంది ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి కారణంగా భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని హోమ్ మేడ్ టిప్స్‌ను పాటించడం వల్ల.. నొప్పి తగ్గడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

హీట్ థెరపీ:

హీట్ థెరపీ సహాయంతో మీరు నెలసరిలో వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చు. నొప్పి వచ్చినప్పుడు హీట్ బ్యాగ్ ‌ని పెట్టుకోవాలి. ఈ వేడి వల్ల నొప్పులు తగ్గుతాయి. అంతే కాకుండా వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి.

హెర్బల్ టీలు:

పీరియడ్స్ లో నొప్పులు వచ్చినప్పుడు హెర్బల్ టీలు తాగడం వల్ల కూడా నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం టీ, గ్రీన్ టీ, పెప్పర్ మెంట్ టీ, తులసి టీ వంటివి తాగడం వల్ల నొప్పి కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఈ టీల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కండరాల నొప్పులను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

ఇవి కూడా చదవండి

డైట్‌లో మార్పులు చేసుకోండి:

డైట్‌లో మార్పులు చేసుకోవడం వల్ల కూడా నెలసరిలో వచ్చే పెయిన్‌ని తగ్గించుకోవచ్చు. మీరు తిసుకునే ఆహారంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోండి. ఇవి తినడం వల్ల కూడా పీరియడ్స్ పెయిన్ తగ్గించుకోవచ్చు.

రిలాక్సేషన్ అవ్వండి:

పీరియడ్స్ సమయంలో మీకు ఒళ్లు నొప్పులగా ఉంటే.. రిలాక్సేషన్ అవ్వండి. మెడిటేషన్, బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల కూడా మీరు సులభంగా పీరియడ్స్ పెయిన్ నుంచి రిలీఫ్ పొందవచ్చు.

మెగ్నీషియం సప్లిమెంట్:

మెగ్నీషియంను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా నెలసరిలో వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఆక్యుపెంచర్ థెరపీతో కూడా పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
వ్యాక్సిన్లపై సంచలనం రేపుతున్న పరిశోధనలు!
వ్యాక్సిన్లపై సంచలనం రేపుతున్న పరిశోధనలు!