- Telugu News Photo Gallery Aloevera remedy to get long black shiny hair naturally Telugu lifestyle news
Aloe Vera For Hairs : నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
కలబందలో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు, అమినో యాసిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడే ఈ ఔషధ మొక్కను అనేక రకాల హోం రెమెడీస్‌లో ఉపయోగిస్తారు. దీని వాడకం వల్ల అనేక జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దీని కోసం అలోవెరా జెల్‌ను మార్కెట్ నుండి కొనుగోలు చేయవచ్చు. తాజా కలబంద ఆకు నుండి జెల్‌ను సేకరించి అప్లై చేయవచ్చు. తాజా అలోవెరా జెల్‌ను నేరుగా కుదుళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి జుట్టు పొడవుగా పెరుగుతుంది.
Updated on: Apr 30, 2024 | 7:22 PM

కలబందను కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు పట్టించాలి. ఇందుకోసం కొబ్బరినూనెలో అలోవెరా జెల్ మిక్స్ చేసి హెయిర్ మాస్క్ లాగా అప్లై చేసుకోవాలి. కావాలంటే ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే..త్వరలోనే పొడవాటి మెరిసే జుట్టును పొందుతారు. దీంతో వెంట్రుకల బలానికి కావాల్సిన పోషణ అందుతుంది.

అలోవెరా జెల్‌ను గుడ్డుతో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పూర్తి పోషణ లభిస్తుంది. దీని కోసం ఒక గిన్నెలో కలబందను తీసుకుని అందులో ఒకటిన్నర చెంచా ఆలివ్ ఆయిల్, గుడ్డులోని తెల్లసోనను కలిపి జుట్టుకు పట్టించి అరగంట సేపు అలాగే ఉంచి కడిగేయాలి ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకసారి జుట్టుకు అప్లై చేయవచ్చు. కోడిగుడ్డులోని ప్రోటీన్స్ జుట్టు బలంగా పెరిగేందుకు సహాయపడతాయి.

అలోవెరా జెల్, కొబ్బరి పాల మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. కాబట్టి ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. దీని కోసం 4 చెంచాల కొబ్బరి పాలలో 4 చెంచాల అలోవెరా జెల్ కలపండి. అవసరమైతే, మీరు కొంచెం కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న హెయిర్ మాస్క్ ను జుట్టుకు పట్టించి అరగంట నుంచి గంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత జుట్టును కడిగి శుభ్రం చేసుకోవాలి.

తాజా కలబంద ఆకు నుండి తీసిన గుజ్జును మీ జుట్టుకు పట్టించాలనుకుంటే, ముందుగా ఆకును కత్తిరించి లోపల ఉన్న జెల్‌ను బ్లెండర్‌లో రుబ్బుకోవాలి. అలోవెరా జెల్‌లో కొద్దిగా ఆముదం నూనె వేసి కుదుళ్లకు అప్లై చేయాలి. దీనిని 30 నిమిషాల పాటు ఉంచి తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ రెండింటిలోని పోషకాలు జుట్టును మెరిసేలా చేస్తాయి. ఇలా చేస్తే జుట్టుకు తగినంత తేమ అందుతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది.

తాజా అలోవెరా జెల్‌ను నేరుగా కుదుళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి జుట్టు పొడవుగా పెరుగుతుంది. అలోవెరా జెల్‌లో కొద్దిగా యోగర్ట్ కలిపి హెయిర్ మాస్క్ తయారుచేయాలి. దీనిని కుదుళ్లకు అప్లై చేసి కొద్దిసేపు ఉంచి క్లీన్ చేసుకోవాలి. దీని ద్వారా కుదుళ్లలో పీహెచ్ విలువ సమతుల్యం అవుతుంది. వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.




