- Telugu News Photo Gallery Cinema photos Prabhas Spirit Movie Shooting Update after kalki Release on June 27 Telugu Heroes Photos
Prabhas – Spirit: భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
కల్కి రిలీజ్ అయ్యేవరకు మా రాజా సాబ్ గురించి అప్‌డేట్స్ ఏమీ ఉండవబ్బా.. అని డిక్లేర్ చేసేశారు మేకర్స్. అందుకే దూరదృష్టితో ఆలోచిస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ''ఎలాగూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు కాబట్టి, ఇవాళో, రేపో కల్కి ప్రమోషన్లు జోరుగా మొదలవుతాయి. ఆ తర్వాత రాజాసాబ్, సలార్ లైన్లో ఉంటాయి. మరి స్పిరిట్ సంగతేంటి?'' అని ఆరా తీస్తున్నారు. జూన్ 27న గ్రాండ్ లాంచ్‌కి రెడీ అవుతోంది కల్కి మూవీ.
Updated on: Apr 30, 2024 | 9:27 PM

తాజాగా అభిమానుల ఆనందాన్ని డబుల్ చేసే మరో న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య సలార్ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. బాహుబలితో జపాన్‌లోనూ ప్రభాస్‌కు మంచి ఫ్యాన్స్ బేస్ క్రియేట్ అయ్యింది.

ఆ తర్వాత రాజాసాబ్, సలార్ లైన్లో ఉంటాయి. మరి స్పిరిట్ సంగతేంటి?'' అని ఆరా తీస్తున్నారు. జూన్ 27న గ్రాండ్ లాంచ్‌కి రెడీ అవుతోంది కల్కి మూవీ.

ఏపీలో ఏర్పాటయ్యే ప్రభుత్వాన్ని.. 'టిక్కెట్ ధరలు పెంచుకుంటాం' అంటూ సినిమా ఇండస్ట్రీ నుంచి అప్రోచ్ అయ్యే ఫస్ట్ హీరో ప్రభాసే అవుతారన్నది జనం మాట.

సో.. నాగ్ అశ్విన్ విజువల్ వండర్ పోస్ట్ సమ్మర్‌కి సిద్ధమవుతోంది. సినిమా సక్సెస్ అయితే జులైలోనూ అవే వైబ్స్ సాగుతాయి. అంటే ఆగస్టు నుంచి రాజా సాబ్ అప్‌డేట్స్ మొదలవుతాయన్నమాట. అది రన్నింగ్‌లో ఉండగానే సలార్2 సంగతులు క్యూలోకొచ్చేస్తాయి.

ప్రశాంత్ నీల్ అప్పటికే రెడీగా ఉంటే, ప్రభాస్ అండ్ పృథ్వి కూడా శౌర్యాంగపర్వం సెట్లోకి అడుగు పెట్టేస్తారు. ఈ రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఫినిష్ చేస్తేనే నెక్ట్స్ స్పిరిట్‌కి కాల్షీట్ సర్దడానికి కుదురుతుంది డార్లింగ్‌కి.

మెట్టుకు మెట్టూ ఎక్కడమే కానీ, దిగడం ఉండదు అని ఆల్రెడీ చెప్పేశారు సందీప్ రెడ్డి వంగా. ఆయన ఈ మాట అన్నది కేవలం యానిమల్ పార్క్ గురించే కాదు.. ప్రభాస్ స్పిరిట్ గురించి కూడా.

యస్. నెవర్ బిఫోర్ సీన్ అవతార్‌లో, ప్రభాస్ చేసే యాక్షన్ ఇంకో రేంజ్‌లో ఉంటుందని చెప్పకనే చెప్పేశారు కెప్టెన్. ఈ మాటలు వినగానే ప్రభాస్ గత సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ ని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్.




