AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా… అయితే జ్యుడీషియల్ ఎంక్వైరీ లో మీక్కూడా అవకాశం.

అయితే 16 టీఎంసీల కెపాసిటీ ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ ని నిరుపయోగం చేశారని ఇటు బి ఆర్ ఎస్ అంటే దానికి కారణం మీరే అని కాంగ్రెస్ అంటుంది. రానున్న వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్‌ని వినియోగంలోకి తీసుకురావాలంటే దానికి ఎటువంటి రిపేర్లు చేయాలన్న నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చే సూచనల ఆధారంగా మాత్రమే ముందడుగు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం...

కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా... అయితే జ్యుడీషియల్ ఎంక్వైరీ లో మీక్కూడా అవకాశం.
Kaleshwaram Project
Sravan Kumar B
| Edited By: Narender Vaitla|

Updated on: Apr 30, 2024 | 6:56 PM

Share

కాలేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కాలేశ్వరం స్థితికి గల కారణాలపై కారకులపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు రూ. లక్ష కోట్ల వరకు ఖర్చు అయ్యిందని.కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలంటే మరో 50 వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప దాన్ని వినియోగంలోకి తేలేమని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కాలేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన మేడిబడ్డ బ్యారేజ్ లోని ఏడవ బ్లాక్ లో పిల్లర్ నెంబర్ 19,20,21 కుంగిపోవటంతో డ్యాంలోని నీటిని మొత్తం కిందికి వదిలారు.

అయితే 16 టీఎంసీల కెపాసిటీ ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ ని నిరుపయోగం చేశారని ఇటు బి ఆర్ ఎస్ అంటే దానికి కారణం మీరే అని కాంగ్రెస్ అంటుంది. రానున్న వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్‌ని వినియోగంలోకి తీసుకురావాలంటే దానికి ఎటువంటి రిపేర్లు చేయాలన్న నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చే సూచనల ఆధారంగా మాత్రమే ముందడుగు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది.ఇప్పటికే ఎన్ డి ఎస్ ఎ ఎక్స్పర్ట్ కమిటీ రెండు సార్లు కాలేశ్వరం ప్రాజెక్టుని సందర్శించి నాలుగు నెలల్లోగా నివేదికను ఇవ్వబోతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం NDSA నిపుణుల కమిటీని మద్యంతర రిపోర్ట్ లో రిపేర్లు చేసే అవకాశం ఉంటే మరమ్మత్తులు చేపట్టి వచ్చే సీజన్ కి రైతులకి అందుబాటులోకి డాంని తీసుకొస్తామని చెబుతోంది.

ఇక ఎన్ డి ఎస్ ఏ రిపోర్ట్ తో పాటు కాగ్ నివేదికలు, విజిలెన్స్ రిపోర్ట్లు పరిగణలోకి తీసుకోవాలని భావించండి జ్యుడీషియల్ ఎంక్వయిరీ కమిషన్. కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ జరిపి ప్రాజెక్టు కుంగుబాటుకు కారణాలు, కారకులను తెల్చే పనిలో పడింది.అందుకోసం సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ మొదటి లోక్పాల్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోషను నియమించింది. బాధ్యతలు చేపట్టిన పినాకి చంద్రగోస్ ఏప్రిల్ 25 26 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించారు. మొదటి దశ విసిట్లో ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు డాక్యుమెంట్లు పరిశీలించారు. ఇప్పటికే 9 రకాల అంశాలపై సమాచారం కోరిన పినాకి చంద్రబోస్ పర్యటనలో భాగంగా మరింత సమాచారం కోరారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పినాకి చంద్ర ఘోష్ ని మర్యాదపూర్వకంగా కలిసి కాలేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు విచారణను వీలైనంత తొందరగా పూర్తి చేస్తానని అన్ని రిపోర్టులను పరిశీలించి నిపుణుల సలహాలు సలహార మేరకు విచారణ జరిపిస్తాననితెలిపారు.

అయితే సామాన్య ప్రజలు కూడా తమ వద్ద కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే నూట్రి ద్వారా అఫిడవిట్ని చేయించి దానికి సరైన ఆధారాలను జతపరిచి కమిషన్ కమిషన్ ని ఆశ్రయించవచ్చని తెలిపింది. ప్రజల వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న మే 30 లోగా కమిషన్ కి అందించవచ్చు. తొమ్మిది అంతకన్నా సాక్షాలను పోస్టు ద్వారా పంపించవచ్చు లేదా హైదరాబాద్లోని బి ఆర్ కే భవన్ లోని ఎనిమిదవ అంతస్తులో ఉన్న జ్యుడీషియల్ ఎంక్వయిరీ కమిషన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్సులో వేయవచ్చని తెలిపింది. ఇక విచారణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించడం కోసం అడిషనల్ ఇరిగేషన్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో ఒక నోడల్ టీం ఏర్పాటు చేసింది.

ఇక పినాకి చంద్ర ఘోష్ కూడా ఒక ప్రత్యేక టీంని సెట్ చేశారు. ఈ టీంలో ఇరిగేషన్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, సీనియర్ లాయర్, ప్రాజెక్ట్ డిజైన్ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ఇతర నిపుణులు ఉంటారు. జ్యుడీషియల్ కమిషన్ స్వతంత్రంగా విచారణ జరుపుతున్నప్పటికీ కాగ్ నివేదిక, విజిలెన్స్ రిపోర్ట్, NDSA మధ్యంతర ఉత్తర్వులను పూర్తిగా స్టడీ చేస్తామని జస్టిస్ పినాకి తెలిపారు. ఇక మొదటి విసిట్ లోనే కాలేశ్వరం ప్రాజెక్ట్ సందర్శిస్తారని అనుకున్నప్పటికీ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ లు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత రెండు విజిట్ లో కాలేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రత్యక్షంగా సందర్శించనుంది జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్. మూడు రోజుల పర్యటన ముగించుకుని ఏప్రిల్ 27న కోల్కత్తా తిరిగి వెళ్లిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ వచ్చేవారం పర్యటనలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. అయితే జ్యుడీషియల్ ఎంక్వయిరీ రిపోర్ట్ సమర్పించడానికి జూన్ 30న డెడ్లైన్ విధించడంతో 90 రోజుల్లో కాలేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపి కాలేశ్వరం దుస్థితికి కారణాలతో పాటు కారకులను ఎవరో కూడా కమిషన్ తేల్చనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..