AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..

రఘురాం రెడ్డికి సినీ హీరో వెంకటేష్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు వియ్యంకులు అవుతారు. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి.. వీరి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ.

Venkatesh: ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
Venkatesh
N Narayana Rao
| Edited By: Rajeev Rayala|

Updated on: Apr 30, 2024 | 6:35 PM

Share

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సినీ హీరో వెంకటేష్. మే 7 నుంచి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు వెంకటేష్. రఘురాం రెడ్డికి సినీ హీరో వెంకటేష్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు వియ్యంకులు అవుతారు. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి.. వీరి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ. ఆయన హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బీకామ్ విద్యను, అనంతరం పీజీ డిప్లొమా విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మంలోనే పుట్టి పెరిగారు. రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు. కాగా వారిలో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు.

రామసహాయం రఘురాం రెడ్డి తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒక వైపు వ్యాపారాలు చేస్తూనే.. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులతో వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉండేది. సురేందర్ రెడ్డి కూసుమంచి మండలంలోని జీళ్ళచెర్వు, చేగొమ్మ, ముత్యాలగూడెం గ్రామాలకు, ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి పోలీస్ పటేల్ గా పనిచేశారు.. రఘురాం రెడ్డి తరపున కాంగ్రెస్ మంత్రులు ,నేతలతో పాటు పొంగులేటి కుటుంబ సభ్యులు అందరూ ప్రచారం చేస్తున్నారు..ఇపుడు వియ్యంకుడు తరపున వెంకటేష్ తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించ నున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.