AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మద్యం ప్రియుల గోడు తీర్చిన ఎక్సైజ్ శాఖ.. సంబరాలు చేసుకున్న తాగుబోతుల సంఘం సభ్యులు..

మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తరుణ్ చేసిన పోరాటం ఫలించింది. కూలింగ్ బీర్ల కొరతతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మండు టెండల్లో మద్య ప్రియుల బాదలు తీర్చాలంటూ మంచిర్యాల ఐబీ నుండి మంచిర్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి ఎక్సైజ్ శాఖకు తన గోడు వెళ్లబోసుకున్నాడు మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు.. దీంతో అతని పోరాటం 24 గంటల్లోనే ఫలించింది.

Viral: మద్యం ప్రియుల గోడు తీర్చిన ఎక్సైజ్ శాఖ.. సంబరాలు చేసుకున్న తాగుబోతుల సంఘం సభ్యులు..
Drunkards
Naresh Gollana
| Edited By: |

Updated on: Apr 30, 2024 | 7:57 PM

Share

మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తరుణ్ చేసిన పోరాటం ఫలించింది. కూలింగ్ బీర్ల కొరతతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మండు టెండల్లో మద్య ప్రియుల బాదలు తీర్చాలంటూ మంచిర్యాల ఐబీ నుండి మంచిర్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి ఎక్సైజ్ శాఖకు తన గోడు వెళ్లబోసుకున్నాడు మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు.. దీంతో అతని పోరాటం 24 గంటల్లోనే ఫలించింది. మంచిర్యాల జిల్లా‌వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్లు, బార్లలో కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. దీంతో పలువురు తాగుబోతులు సంబరాలు చేసుకున్నారు. తమ తరుపున పోరాటం చేసి తమ బీర్ల దాహం తీర్చిన తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు తాగుబోతులు.

మంచిర్యాల జిల్లాతో పాటు కరీంనగర్ , జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదని, దీంతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని తరుణ్ సోమవారం మంచిర్యాల జిల్లా ఎక్సెజ్ సూపరింటెండెంట్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ వార్త అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వ్యాపించి క్షణాల్లో రాష్ట్ర స్థాయి‌ ఎక్సైజ్ శాఖకు చేరింది.

వీడియో చూడండి..

ఈ రకమైన వినూత్న నిరసన తొలి సారి‌ కావడంతో సర్వత్రా చర్చకు దారి తీసింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు లైట్ బీర్ల కొరతకు వెంటనే చెక్ పెట్టారు. 24 గంటల్లోనే తమ కష్టాలు తీర్చిన అదికారులకు అభినందనలు తెలిపాడు తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తరుణ్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్