Telangana: తెలంగాణ గవర్నర్ వర్సెస్ బీఆర్‌ఎస్.. మెడికల్ కాలేజీల అంశంలో ట్విట్టర్ వార్..
తెలంగాణలో గవర్నర్ వర్సెస్ బీఆర్‌ఎస్ ట్విట్టర్ వార్ నడుస్తోంది. మెడికల్ కాలేజీల కేటాయింపులపై ట్వీట్లు.. కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ ప్రభుత్వం అసలు దరఖాస్తే..

తెలంగాణలో గవర్నర్ వర్సెస్ బీఆర్‌ఎస్ ట్విట్టర్ వార్ నడుస్తోంది. మెడికల్ కాలేజీల కేటాయింపులపై ట్వీట్లు.. కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ ప్రభుత్వం అసలు దరఖాస్తే చేయలేదన్నారు గవర్నర్ తమిళసై. తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేయడంలో ఫెయిలై.. ఆలస్యంగా నిద్రలేస్తే ఎలా అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దీనికి స్పందించిన బీఆర్‌ఎస్ అంతే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం అప్లై చేసిందంటూ చేసిన వీడియోలతో బీఆర్‌ఎస్ కౌంటర్ ఇచ్చింది. మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేశామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.
కాగా, ఇంతకు ముందు పెండింగ్ బిల్లుల అంశంలోనూ గవర్నర్, బిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదింపజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై స్పందించిన గవర్నర్.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చురకలంటిస్తూ ట్వీట్లు చేశారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దూరమా? అంటూ కామెంట్స్ చేశారు. సరైన పద్ధతిలో వచ్చి మాట్లాడి సెటిల్ చేసుకుంటే సరిపోయేది కదా అంటూ ట్వీట్లు చేశారు గవర్నర్ తమిళిసై. అయితే, ఈ విషయంలోనూ గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. గవర్నర్‌కు బానిసలు ఎవరూ లేరని, బిల్లుల ఆమోదానికి ఫైరవీలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ప్రభుత్వ పెద్దలు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..