AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2: OTTలోకి అఖండ2... డేట్ ఫిక్స్ ?

Akhanda 2: OTTలోకి అఖండ2… డేట్ ఫిక్స్ ?

Phani CH
|

Updated on: Jan 05, 2026 | 9:02 PM

Share

బాలకృష్ణ నటించిన "అఖండ 2 తాండవం" బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసి విజయం సాధించింది. సినిమా విడుదలైన నెల రోజులకు, అభిమానులు ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకోగా, జనవరి 9 నుండి స్ట్రీమింగ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది, దీంతో బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య కెరీర్లో వన్‌ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నామ్ కమాయించిన మూవీ అఖండ. 2021లో రిలీజ్‌ అయిన ఈ మూవీ అప్పట్లో దిమ్మతిరిగే రేంజ్లో హిట్ అయింది. సీక్వెల్‌ కావాలనే డిమాండ్‌ అప్పట్లోనే వచ్చింది. ఈక్రమంలోనే అఖండకు సీక్వెల్‌గా అఖండ2 తాండవం సినిమాను తెరకెక్కించాడు బోయపాటి. ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 6న రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లను వసూలు చేసింది. అఖండ తాండవం రిలీజ్‌ అయిన దాదాపు నెల కావస్తోంది. దీంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని అందరూ ఆరాలు తీస్తున్నారు. ఇక వారి కోసమే అన్నట్టు ఇప్పుడో అప్డేట్ బయటికి వచ్చింది. అఖండ 2 ఓటీటీ రిలీజ్ గురించి ఇప్పుడో ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్.. ఈ సినిమాను జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. మరో రెండు మూడు రోజుల్లో.. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. దీంతో ఫిల్మ్ లవర్స్ అండ్ బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఇప్పటి నుంచే ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్‌. ప్రస్తుం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లలో ఉంది. ఈ మూవీ కోసం బాలయ్య మస్కలర్‌ లుక్‌లోకి మారనున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్

Allu Arjun: బన్నీ థియేటర్‌ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్‌.. సంక్రాంతికి ఓపెన్

The Raja Saab: ఇంటర్వ్యూ పుణ్యమాని మరో లీక్‌ !! పార్ట్‌2 పై లీకిచ్చిన మారుతీ

అమెరికా గ్రీన్ కార్డ్ కావాలా ?? పెళ్లి చేసుకుంటే సరిపోదు.. కలిసి ఉండాల్సిందే

మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు.. 3AC టికెట్ రూ. 2 వేల 300

Published on: Jan 05, 2026 09:01 PM