Allu Arjun: బన్నీ థియేటర్ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్.. సంక్రాంతికి ఓపెన్
స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతున్నారు. హైదరాబాద్ కోకాపేటలో ఆయన నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ థియేటర్ దేశంలోనే అతిపెద్ద 75 అడుగుల డాల్బీ స్క్రీన్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ప్రత్యేకతలు. సంక్రాంతి పండుగకు ఓపెనింగ్ ప్లాన్ చేస్తున్నారు.
ఒకప్పటిలా స్టార్ హీరోలందరూ కేవలం సినిమాలకే పరిమితం అవ్వడం లేదు. ఇప్పటి స్టార్ హీరోలు.. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క బిజినెస్ రంగంలో అడుగుపెడుతున్నారు. రెండు చేతులా సంపాదించేలా ట్రెండ్ సెట్ చేసుకున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఇప్పుడీ ట్రెండ్‌ను పీక్ స్టేజ్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్‌ను మన హైదరాబాదీల కోసం తొందర్లో ఓపెన్ చేయనున్నాడు. రెస్టారెంట్స్ తో అమీర్ పేట్ సెంటర్లో ఏఏ ఆసియన్ సినిమాస్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్… తన పేరుతో మరో మల్టీప్లెక్స్‌ను హైద్రాబాద్ కోకాపేటలో నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ను తన మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నాడు బన్నీ. అంతేకాదు అల్లు సినిమాస్ థియేటర్లో చాలా ప్రత్యేకలు ఉన్నాయని న్యూస్.75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్, అద్భుతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఈ థియేటర్ లో సెట్ చేశారు బన్నీ. ఇక ఈ భారీ థియేటర్ ఓపెనింగ్ సంక్రాంతి పండుగ సందర్బంగా జరుగనుందని టాక్ నడుస్తోంది. ఈ థియేటర్ ప్రమోషన్స్ కోసం స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగనున్నాడని.. త్వరలోనే థియేటర్ ప్రమోషన్ పనులు కూడా మొదలుకానున్నాయని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Raja Saab: ఇంటర్వ్యూ పుణ్యమాని మరో లీక్ !! పార్ట్2 పై లీకిచ్చిన మారుతీ
అమెరికా గ్రీన్ కార్డ్ కావాలా ?? పెళ్లి చేసుకుంటే సరిపోదు.. కలిసి ఉండాల్సిందే
మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు.. 3AC టికెట్ రూ. 2 వేల 300
వాహనదారులకు కేంద్రం శుభవార్త.. సరికొత్త రూల్ ఫిబ్రవరి 1 నుండి అమలు
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

