Gold Price Today: బంగారం,వెండి ధరలకు రెక్కలు.. సోమవారం తులం ఎంతంటే
కొత్త సంవత్సరంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్టుబడుల డిమాండ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ధరలు భారీగా పెరిగాయి. గత ఐదు రోజుల్లో బంగారం ధర మూడుసార్లు పెరిగింది. హైదరాబాద్‌తో సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,37,400కి, వెండి రూ.2,65,000కి చేరాయి.
బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి.కొత్త సంవత్సరంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లో బంగారం ధర మూడుసార్లు పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారికి ఇది మంచి లాభాలా పంటగా మారింది. డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు. జనవరి 5, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,37,400 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,25,950 రూపాయలుగా ఉంది.హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,65,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,550 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,26,100 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,400 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,25,900 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,330 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,26,800 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,400 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,25,900 వద్ద కొనసాగుతోంది. కోల్ కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,400 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,25,950 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా భారీగానే పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,65,000 రూపాయిలుగా ఉంది. వెనిజులాపై అమెరికా సైనిక దాడి తర్వాత విలువైన లోహాల ధరలు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో విలువైన లోహాల ధరలు పెరుగుతాయి. ఇది బంగారం, వెండి వంటి సురక్షితమైన లోహాలకు డిమాండ్‌ను పెంచుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Faima: బాయ్ ఫ్రెండ్‌కు జబర్దస్థ్ ఫైమా స్వీట్ బర్త్ డే సర్‌ప్రైజ్
Akhanda 2: OTTలోకి అఖండ2… డేట్ ఫిక్స్ ?
బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్
Allu Arjun: బన్నీ థియేటర్ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్.. సంక్రాంతికి ఓపెన్
The Raja Saab: ఇంటర్వ్యూ పుణ్యమాని మరో లీక్ !! పార్ట్2 పై లీకిచ్చిన మారుతీ
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే
దేశీ స్టయిల్లో రోడ్డు దాటిన రష్యన్ మహిళలు..
చలి కాచుకోవడానికి వచ్చిన పాముతో ముచ్చట్లు పెట్టిన వ్యక్తి..
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి

