మండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను టికెట్లు అడుక్కోలేదని, పార్టీయే ఇచ్చిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఉద్యమకారులను విస్మరించిందని, టీఆర్ఎస్ పేరు మార్పును వ్యతిరేకించినట్లు తెలిపారు. బీజేపీ అరెస్టు చేసినప్పుడు పార్టీ అండగా నిలవలేదని, నైతిక విలువలు లేని బీఆర్ఎస్ను వీడుతున్నందుకు సంతోషంగా ఉందని కవిత అన్నారు.