EPFO Update: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్భుత అవకాశం.. మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు..
LIC Premium: పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించవచ్చని మీకు తెలుసా..? మీ ప్రీమియం పీఎఫ్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా ఆప్షన్ ఉందని తెలుసా..? ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు చాలామందికి తెలియని విషయమిది. ఈ ప్రాసెస్ ఎలా..? అనేది ఇందులో చూద్దాం.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) దేశ ప్రజలకు బీమా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ప్లాన్లు ఉండగా.. కాలానుగుణంగా కొత్త ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. ఎల్‌ఐసీలో లైఫ్, టర్మ్ ఇన్యూరెన్స్ ప్లాన్లతో పాటు డబ్బులు పొదుపు చేసుకునేవారి కోసం సేవింగ్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో కోట్లాది మంది ఎల్‌ఐసీ కస్టమర్లుగా ఉన్నారు. ఎల్‌ఐసీలో పాలసీ తీసుకుంటే ఇయర్లీ లేదా నెలనెలా, 3 లేదా 6 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లేదా ఎల్‌ఐసీ కార్యాలయాలకు వెళ్లి ఆఫ్‌లైన్ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. ఎవరికి తెలియని ఓ విషయం ఏంటంటే.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఆ అకౌంట్ నుంచే ఎల్‌ఐసీ ప్రీమియం అనేది చెల్లించవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
నేరుగా పీఎఫ్ అకౌంట్ నుంచి..
మీరు నేరుగా పీఎఫ్ అకౌంట్ నుంచే ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు. పీఎఫ్ అకౌంట్ నుంచే ప్రీమియం డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. ఇందుకోసం మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో ప్రీమియంకు కావాల్సిన డబ్బులు కలిగి ఉండాలి. అలాగే కొత్త పాలసీ తీసుకోవాలన్నా పీఎఫ్ బ్యాలెన్స్ నేరుగా వాడుకోవచ్చు. ఇందుకోసం మీ పీఎఫ్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండటంతో పాటు కనీసం మీ రెండు నెలల శాలరీకి సమానమైన బ్యాలెన్స్ కలిగి ఉండాలి. పాలసీ మీ పేరు మీద ఉంటేనే పీఎఫ్ అకౌంట్ నుంచి నేరుగా ప్రీమియం చెల్లించడానికి వీలవుతుంది. మీ కుటుంబసభ్యులు లేదా ఇతరుల ప్రీమియం చెల్లించేందుకు కుదరదు. కేవలం వార్షిక ప్రీమియం చెల్లించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.
ఈ స్టెప్ట్ ఫాలో అవ్వండి
-ఈపీఎఫ్‌వో వెబ్ సైట్ ఓపెన్ చేయండి -ఫారం 14ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు పూర్తి చేయండి -ఫారంను సబ్మిట్ చేయండి -ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లోకి మీ డీటైల్స్‌తో లాగిన్ అవ్వండి -కేవైసీ సెక్షన్‌లోకి వెళ్లండి -ఎల్‌ఐసీ అనే ఆప్షన్ ఎంచుకోండి -పాలసీ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేయండి -మీ వివరాలు వెరిఫై అయ్యాక ఎల్‌ఐసీ ప్రీమియం నగదు ఆటోమేటిక్‌గా పీఎఫ్ నిల్వల నుంచి కట్ అవుతాయి
