బ్రౌన్ Vs వైట్ బ్రెడ్.. ఏది ఆరోగ్యానికి మంచిది?
05 January 2026
TV9 Telugu
TV9 Telugu
చాలా మంది రోటీన్ బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్ కూడా ఒకటి. కొంత మంది ఉదయం పూట టీ తో దీనిని తీసుకుంటూ ఉంటారు. శాండ్‌విచ్, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ అండ్ జామ్ ఇలా వివిధ రకాలుగా బ్రెడ్ తీసుకోవడం షరా మామూలే
TV9 Telugu
అలాగే జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలతో బాధపడేటప్పుడు కూడా సులభంగా జీర్ణమవుతుందని బ్రెడ్ ను పాలతో తీసుకుంటూ ఉంటారు
TV9 Telugu
అయితే మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేవి వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్. ఈ రెండు రకాల బ్రెడ్ లలో ఏది మంచిది.. దేనిని తీసుకోవాలి.. అనే సందేహం చాలా మందికి ఉంటుంది
TV9 Telugu
వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. గోధుమలు, హోల్ గ్రెయిన్స్ తో చేసిన బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందట
TV9 Telugu
అయితే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ కేవలం రంగును చూసి మాత్రమే ఆరోగ్యానికి మంచిదని భావించకూడదు. మార్కెట్ లో బ్రౌన్ బ్రెడ్ అని నకిలీ బ్రెడ్ లను కూడా అమ్ముతూ ఉంటారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి
TV9 Telugu
వైట్ బ్రెడ్ ను మైదా పిండితో తయారు చేస్తారు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఇక బ్రౌన్ బ్రెడ్ గోధుమ రంగులో కనబడడానికి కారామెల్ రంగును వాడుతూ ఉంటారు
TV9 Telugu
ఇలా తయారు చేసిన బ్రెడ్ మంచిది కాదు. కనుక బ్రౌన్ బ్రెడ్ ను కొనుగోలు చేసేటప్పుడు 100 శాతం గోధుమలతో, తృణ ధాన్యాలతో చేసిన బ్రెడ్ ను చూసి మాత్రమే ఎంపిక చేసుకోవాలి
TV9 Telugu
గోధుమలతో, హోల్ గ్రెయిన్ లతో చేసిన బ్రౌన్ బ్రెడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల పేగుల్లో కదలికలు ఎక్కువగా ఉంటాయి. పేగులల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. కనుక వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం మంచిది