Raghuveera Reddy: సామాన్యుడిలా రఘువీరారెడ్డి మనవరాలితో కలిసి జలవిహారం.. వీడియో వైరల్.
ఆయనదో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, ఉమ్మడి ఆంధప్రదేశ్ కు మంత్రిగా పీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. కాలక్రమంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వ్యవసాయదారుడిగా హలం పట్టి.. సామాన్యుడిలా పొలం దున్నుతున్నారు.
ఆయనదో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, ఉమ్మడి ఆంధప్రదేశ్ కు మంత్రిగా పీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. కాలక్రమంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వ్యవసాయదారుడిగా హలం పట్టి.. సామాన్యుడిలా పొలం దున్నుతున్నారు. వయసు రీత్యా వచ్చే మార్పులను సామాన్యులే అంగీకరించక మేకప్ వేసుకుంటున్న రోజుల్లో సామాన్యుడిగా జీవిస్తున్న రాజకీయ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి తన మనవరాలితో కలిసి జలవిహారం చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఎక్కడా హస్తం పార్టీకి ప్రాతినిధ్యం అన్నదే లేకుండా పోయింది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన రఘువీరారెడ్డి వంటి నేత కూడా దాదాపు అజ్ఞాతంలో గడిపేంతగా పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా కొన్నాళ్లు పనిచేసిన రఘువీరా ఆ తర్వాత పూర్తిగా స్వగ్రామం నీలకంఠాపురానికి పరిమితయ్యారు. ఈ క్రమంలో ఆయన వందల ఏళ్ల నాటి పురాతన ఆలయాల పునరుద్ధరణకు నడుంబిగించి అనుకున్నది పూర్తి చేశారు. అప్పుడప్పుడు రఘువీరా సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలు పంచుకుంటూ అభిమానులను పలకరిస్తుంటారు. తాజాగా, తన మనవరాలితో కలిసి ఓ ఫైబర్ డింగీలో జలవిహారం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. తమ స్వగ్రామం నీలకంఠాపురం వద్ద ఓ జలాశయంలో మనవరాలితో కలిసి సరదాగా గడిపినట్టు రఘువీరా ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

