Telangana: తెలంగాణ విద్యార్ధులకు పండుగ చేసుకునే న్యూస్.. ఈసారి సంక్రాంతికి భారీగా సెలవులు..
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అధికారికంగా ప్రకటించారు. ఈసారి విద్యార్ధులకు భారీగా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరి ఎన్ని రోజులు ఈ సెలవులు ఇచ్చారో తెలుసా.? ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి. ఆ వివరాలు..

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు వరుసగా సెలవులు రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనవరి 10 నుంచి జనవరి 16 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. తిరిగి జనవరి 17 శనివారం పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. నిజానికి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఉన్నప్పటికీ, జనవరి 16న కనుమ పండుగను ఐచ్ఛిక సెలవుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే పండుగ మరుసటి రోజే కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం జనవరి 16 వరకు సెలవులను పొడిగిస్తూ డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
అకడమిక్ కాలెండర్ ప్రకారం ఆరు రోజులు కాగా.. తాజా ఉత్తర్వులతో మరోక అదనపు హాలిడే యాడ్ అవ్వడంతో మొత్తం 7 రోజులు సంక్రాంతి సెలవులు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్ల ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలు కింద నడిచే పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు(DEOs) తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. పండుగ పూట ఊళ్లకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ నిర్ణయంతో ఊరట లభించినట్లయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




