ఆచితూచి అడుగులేస్తున్న బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య

5  January 2026

Pic credit - Instagram

Rajeev 

సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో వైష్ణవి చైతన్య ఒకరు. ఈ అమ్మడుకి మంచి ఫాలోయింగ్ ఉంది. 

సోషల్ మీడియాలో పాపులర్ అయిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ఆతర్వాత  హీరోయిన్ గా మారింది.

 యూట్యూబ్ వీడియోలు చేసింది.అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది ఈ చిన్నది. 

మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అల్లు అర్జున్ నటించిన ఆలా వైకుంఠపురంలో సినిమాలో బన్నీ చెల్లెలిగా కనిపించింది. 

అలాగే నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించింది. ఇక హీరోయిన్ గా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది .

బేబీ సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరించింది. ఆతర్వాత వచ్చిన లవ్ మీ సినిమా ఫ్లాప్ అయ్యింది. 

ఇక ఇప్పుడు ఎపిక్ అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.