AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసుగు చెందుతున్నారా..? ఈ ఒక్క ప్రభుత్వ యాప్‌ మీ ఫోన్‌లో ఉంటే చింత తీరినట్లే..

స్పామ్ కాల్స్ వల్ల ఇబ్బంది పడని మొబైల్ వినియోగదారులంటూ ఎవరూ ఉండరు. రోజూ వచ్చే స్పామ్ కాల్స్ వల్ల మొబైల్ వాడాలంటేనే చిరాకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకింగ్ కాల్స్ పక్కన పెడితే.. సైబర్ మోసాలకు పాల్పడే స్పామ్ కాల్స్ కూడా ఉంటున్నాయి.

Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసుగు చెందుతున్నారా..? ఈ ఒక్క ప్రభుత్వ యాప్‌ మీ ఫోన్‌లో ఉంటే చింత తీరినట్లే..
Spam Calls
Venkatrao Lella
|

Updated on: Jan 06, 2026 | 7:26 AM

Share

మొబైల్ వాడే ప్రతీఒక్కరినీ స్పామ్ కాల్స్ అనేవి తలనొప్పి తెప్పిస్తూ ఉంటాయి. రోజూ వేర్వేరు నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెస్సేజ్‌లు వస్తూ ఉంటాయి. ఒక నెంబర్‌ను బ్లాక్ చేసినా మరో నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ చేస్తూ ఉంటారు. కాల్ కట్ చేసినా అదే పనిగా చేస్తూ విసుగు తెప్పిస్తూ ఉంటారు. పర్సనల్ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డ్ కావాలా..? ఇన్యూరెన్స్ తీసుకుంటారా..? అంటూ రోజూ కాల్స్ చేస్తూ ఉంటారు. వద్దని చెప్పినా మళ్లీ తర్వాతి రోజు కాల్ చేసి అడుగుతారు. మొబైల్ వినియోగదారులు ఇలాంటి స్పామ్ కాల్స్ బెడదతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మరికొంతమంది స్కామర్లు స్పామ్ కాల్స్‌తో బురిడీ కొట్టిస్తూ ఉంటారు.

ఆఫీసులో పనిలో బిజీగా ఉన్నప్పుడో.. బైక్‌పై వెళ్లేటప్పుడే ఇలాంటి స్పామ్ కాల్స్ వస్తే మనకు చిర్రెత్తుకొస్తూ ఉంటుంది. రోజుకు నాలుగైదు కాల్స్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసినా ఏదొక కొత్త నెంబర్ నుంచి కాల్స్ చేని వేధిస్తూనే ఉంటారు. వీటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ కఠిన రూల్స్ తీసుకొచ్చింది. ఫైనాన్స్ సంస్థలు ప్రత్యేక నెంబర్లన వాడాలని సూచించడంతో పాటు మొబైల్ వినియోగదారుల కోసం ఓ యాప్‌ను కూడా తీసుకొచ్చింది.

డీఎన్‌డీ యాప్

స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్ డూ నాట్ డిస్టబ్(DND) యాప్‌ను లాంచ్ చేసింది. ట్రాయ్ డీఎన్‌డీ 3.0 పేరుతో యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ ద్వారా స్పామ్ కాల్స్ రాకుండా మీరు సెట్టింగ్స్ ఆన్ చేసుకోవచ్చు. ఎలాంటి కాల్స్ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారనే ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇక స్పామ్ కాల్స్ గురించి ట్రాయ్‌కు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది ప్రభుత్వ యాప్ కావడంతో మీ డేటాకు భద్రత ఉంటుంది. ఈ యాప్‌ను నిర్వహించేందుకు టెలికాం కంపెనీలతో కలిసి ట్రాయ్ పనిచేస్తుంది ఇక స్పామ్ కాల్స్ గురించి 1909కి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. లేకపోతే cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

యాప్ వాడటం ఎలా..?

-గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ట్రాయ్ డీఎన్‌డీ 3.0 యాప్‌ను సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి -మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపై వెరిఫై చేయాలి -డీఎన్‌డీ రిజిస్ట్రీలో చేరి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు -ఫిర్యాదుల సెక్షన్‌లోకి వెళ్లి స్పామ్ కాల్స్, మెస్సేజ్‌లపై ఫిర్యాదు చేయవచ్చు -ఫిర్యాదుల స్థితిని యాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు