Business Ideas: ప్రతి నెలా రూ.50 వేల పైనే ఆదాయం! మహిళల కోసం స్పెషల్ బిజినెస్ ఐడియా..
ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ కొత్త వ్యాపారానికి మార్గం చూపింది. తక్కువ పెట్టుబడితో (దాదాపు 1.5 లక్షలు) గోధుమ గడ్డి పౌడర్ వ్యాపారం ప్రారంభించండి. ఇంట్లో, చిన్న గదిలో లేదా టెర్రస్‌పై సులభంగా పెంచుకోవచ్చు. నెలకు రూ.50,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ బిజీ గజిబిజీ లైఫ్‌లో హెల్త్‌ని కాస్త పట్టించుకోకుంటే కష్టమే అనే భావన అందరిలో వస్తోంది. జనాల్లో వచ్చిన ఈ హెల్త్ అవేర్‌నెస్‌తో కొత్త బిజినెస్‌కు తలుపులు తెరుచుకున్నాయి. ఇంతకీ బిజినెస్ ఏంటంటే.. జనాలకు ఆరోగ్యాన్ని పెంచే ఒక ప్రోడక్ట్ ను సేల్ చేస్తూ రెండు చేతులా సంపాదించుకునే ఛాన్స్ వచ్చింది. పెట్టుబడి కూడా మరీ భారీగా కాకుండా ఒక లక్షన్నర రూపాయల వరకు కావొచ్చు. సరిగా ప్లాన్ చేసుకుంటే మీకు నెలకు 50 వేల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశముంది.
భారీ పెట్టుబడి లేకపోయినా, ఎకరాల వ్యవసాయ భూమి లేకున్నా, చిన్న రూమ్ లో కూడా సెట్ చెయ్యవచ్చు. లేదంటే టెర్రస్ పైన కూడా పండించవచ్చు. పాలీ రూమ్ అవసరం లేదు. ఆన్లైన్ లో గోధుమ గడ్డిని పెంచే ట్రేలు దొరుకుతాయి. కోకో పీట్ ట్రేలు అని ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే మీకు లభిస్తాయి. అవి ఆర్డర్ చేసుకుని తెప్పించుకోండి. రూమ్ లో అరలు ఏర్పాటు చెయ్యండి. మంచి క్వాలిటీ గోధుమ ముందుగా కొన్ని గంటలు నీళ్లలో నానబెట్టి స్ప్రాటింగ్ చేసుకోండి. స్ప్రౌటింగ్ అంటే మొలకలెత్తించడం. ఆ మొలకలను ట్రేలలో పలచగా సర్ది తొలి రెండు రోజులు ట్రే ల పైన కవర్ చేసి ఉంచండి.
కవర్ చేయటంవల్ల మొలకను కొంచం త్వరగా పెరుగుతాయి. నీటిని పలచగా స్ప్రే చెయ్యండి. ఫంగస్ రాకుండా జాగ్రత్త పడండి. ఇక టెర్రస్ పైన పెంచుతున్నట్లైతే డైరెక్ట్ సన్ లైట్ పడకుండా జాగ్రత్త పడండి. 7 నుండి 10 రోజులలో ఈ గడ్డి పెరిగి పంట చేతికొస్తుంది. కట్ చేసిన పంటను డ్రయర్ లో ఎండబెట్టుకుని గ్రైండర్ లో పొడి చెయ్యటమే. ఆ పొడిని మంచి మార్కెటింగ్ టెక్నిక్స్‌తో అమ్మవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
