బొప్పాయి పండు రోజూ తింటే కలిగే లభాలు తెలుసా?

05 January 2026

TV9 Telugu

TV9 Telugu

పండ్ల‌ల్లో బొప్పాయి పండు చాలా ప్రత్యేకం. ఇది మ‌న‌కు అన్ని కాలాల్లో అందుబాటులో ఉండటమేకాదు ధర కూడా చాలా త‌క్కువ

TV9 Telugu

బొప్పాయి పండులో విట‌మిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. దీనిని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు

TV9 Telugu

ముఖ్యంగా మలేరియా జ్వ‌రంతో బాధ‌ప‌డే వారు బొప్పాయి పండును తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే బ‌రువు త‌గ్గ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో, బ‌రువును అదుపులో ఉంచ‌డంలో భలేగా ఉపయోగపడుతుంది

TV9 Telugu

ఈ పండులో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఖ‌నిజాలు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే దీనిని తింటే చాలా సమయం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. త‌ద్వారా అతిగా తినాల‌నే కోరిక త‌గ్గి శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది

TV9 Telugu

బొప్పాయి పండులో విట‌మిన్ ఎ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. చ‌ర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది

TV9 Telugu

దీనిలో ఉండే విట‌మిన్ సి కొల్లాజెన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. ఫ‌లితంగా చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మంపై ముడ‌తలు తగ్గి వృద్దాప్య ఛాయ‌లు తొలగిపోతాయి

TV9 Telugu

బొప్పాయి తింటే పీరియడ్స్‌ స‌మ‌యంలో వచ్చే కడుపు నొప్పి క్ర‌మంగా త‌గ్గుతుంది. బొప్పాయి పండులో ప‌పైన్ అనే ఎంజైమ్ గ‌ర్భాశ‌యం నుంచి ర‌క్తం స‌జావుగా బ‌య‌ట‌కు వెళ్ల‌డంలో స‌హాయ‌ప‌డుతుంది

TV9 Telugu

ఇది రోగ‌నిరోధ‌క శ‌క్తినిపెంచ‌డంలో కూడా పెంచుతుంది. దీనిలో ఉండే విట‌మిన్ సి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను, ఇన్పెక్ష‌న్ ల‌ను దూరంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది