Weather Report: కరీంనగర్‌లో దంచికొట్టిన వాన.. రాహుల్ గాంధీ సభ రద్దు! మరో 5 రోజులు వానలే వానలు

కరీంనగర్ జిల్లాలో మంగళవారం (మే 7) మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోజంతా భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనాలు సేద తీరారు. ఈదురు గాలులకు పలు చోట్ల టెంట్లు కుప్పకూలి పోయాయి..

Weather Report: కరీంనగర్‌లో దంచికొట్టిన వాన.. రాహుల్ గాంధీ సభ రద్దు! మరో 5 రోజులు వానలే వానలు
Heavy Rain In Karimnagar
Follow us
Srilakshmi C

|

Updated on: May 07, 2024 | 5:13 PM

కరీంనగర్, మే 7: కరీంనగర్ జిల్లాలో మంగళవారం (మే 7) మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోజంతా భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనాలు సేద తీరారు. ఈదురు గాలులకు పలు చోట్ల టెంట్లు కుప్పకూలాయి. అయితే ఆ టైంలో టెంట్ల కింద ఎవరు లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మంగళవారం కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సభ జరగవల్సి ఉంది. మధ్యాహ్నం కురిసిన ఆకస్మిక వర్షానికి సభ రద్దైంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాల్లోని ధన్యం తడిసిపోయింది. చేతిలో కాసులు పడక ముందే ధ్యాన్యం తడిసి పోవడంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు. తడిసిన ధాన్యం కొనే నాథుడెవరంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

రానున్న ఐదు రోజులు వానలే.. వానలు

తెలంగాణలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపింది. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావారణ కేంద్రం ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వానలు కురవనున్నాయి.

ఆదిలాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ అయ్యింది. బుధవారం పలుచోట్ల తేలికపాటి చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.