AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! దంచికొడుతోన్న వానలు.. మరో 4 రోజులు ఇంతే..

మాడు పగిలే ఎండలు, వడగాలులతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారీ వర్షాలతో కాస్త ఉపశమనం కలిగింది. అటు ఏపీ, ఇటు తెలంగాణ...రెండు రాష్ట్రాల్లో గాలి వానతో అలజడి రేగింది. అటు రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు వర్షం బ్రేకులు వేసింది. తెలంగాణలోని..

తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! దంచికొడుతోన్న వానలు.. మరో 4 రోజులు ఇంతే..
Rains 5
Ravi Kiran
|

Updated on: May 07, 2024 | 9:00 PM

Share

మాడు పగిలే ఎండలు, వడగాలులతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారీ వర్షాలతో కాస్త ఉపశమనం కలిగింది. అటు ఏపీ, ఇటు తెలంగాణ…రెండు రాష్ట్రాల్లో గాలి వానతో అలజడి రేగింది. అటు రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు వర్షం బ్రేకులు వేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాయలసీమ వరకు.. తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. ఈ క్రమంలోనే.. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి.. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ.. వరంగల్‌ జిల్లాల్లో వర్షం కురిసింది.

ఇక.. ఏపీలోనూ పలు జిల్లాలో వర్షం దంచి కొట్టింది. అల్లూరి జిల్లా పాడేరు, అరకు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కర్నూలు, మన్యం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. శ్రీకాకుళం, అనకాపల్లిలో ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. మరోవైపు.. ఒక్కసారిగా కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే.. వరి కల్లాల్లోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి.

Follow Us
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?