AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Sunidhi: లైవ్‌ షోలో ప్రముఖ సింగర్‌కి చేదు అనుభవం.. స్టేజ్‌పైకి ‘బాటిల్‌’ విసిరిన ఆకతాయి!

పాపుల‌ర్ సింగ‌ర్‌ సునిధి చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె పాటలు యువతను ఉర్రూతలూగిస్తాయి. తాజాగా సింగ‌ర్‌ సునిధికి ఓ షోలో చేదు అనుభవం ఎదురైంది. ఓ కాలేజీ ఫంక్షన్‌లో లైవ్ షోకు హాజ‌రైన సునిధి.. త‌న పాటలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇంతలో ఓ ఆకతాయి ఆమెపై బాటిల్‌ విసిరి అమర్యాదగా ప్రవర్తించాడు. ఇలాంటి సంఘటన మరెవరికైనా ఎదురైతే కోపం నషాలానికి అంటి.. మైక్‌ విసిరేసి..

Singer Sunidhi: లైవ్‌ షోలో ప్రముఖ సింగర్‌కి చేదు అనుభవం.. స్టేజ్‌పైకి 'బాటిల్‌' విసిరిన ఆకతాయి!
Singer Sunidhi Chauhan
Srilakshmi C
|

Updated on: May 05, 2024 | 5:36 PM

Share

పాపుల‌ర్ సింగ‌ర్‌ సునిధి చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె పాటలు యువతను ఉర్రూతలూగిస్తాయి. తాజాగా సింగ‌ర్‌ సునిధికి ఓ షోలో చేదు అనుభవం ఎదురైంది. ఓ కాలేజీ ఫంక్షన్‌లో లైవ్ షోకు హాజ‌రైన సునిధి.. త‌న పాటలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇంతలో ఓ ఆకతాయి ఆమెపై బాటిల్‌ విసిరి అమర్యాదగా ప్రవర్తించాడు. ఇలాంటి సంఘటన మరెవరికైనా ఎదురైతే కోపం నషాలానికి అంటి.. మైక్‌ విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. కానీ సునిధి మాత్రం కూల్‌గా తనదైన శైలిలో దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది.

సింగర్‌ సునిధి పవర్-ప్యాక్డ్ లైవ్ గిగ్‌లు, లైవ్‌ షోలకు ప్రసిద్ధి. ఆమె డైనమిక్‌ సింగింగ్‌ స్టైల్‌ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. ఫుట్‌టాపింగ్ డ్యాన్స్ చేస్తూ తన శ్రావ్యమైన స్వరంతో హిట్‌ సాంగ్స్‌ పాడుతూ శ్రోతలను ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు. ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన లైవ్‌ కార్యక్రమంలో సునిధి బాలీవుడ్ హిట్ సాంగ్స్ పాడుతూ తన మధుర గాత్రంతో శ్రోత‌ల‌ను ఉర్రూత‌లూగించింది. ఈ షో హుషారుగా సాగిపోతున్న క్రమంలో ఓ ఆకతాయి ఆమెపై బాటిల్‌ విసిరాడు. దీంతో షాక్‌కు గురైన సునిధి.. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోలేదు. ఎవరినీ తిట్టలేదు. షో ఆపేయలేదు.. రెండడుగులు వెనక్కివేసి పాడ పాడటం ఆపకుండా కొనసాగించింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు ఎంతో కూల్‌గా..’ నాపై బాటిల్‌ విసిరితే మీకేం వస్తుంది? ఏమీరాదు. అది షోను డిస్‌టర్బ్‌ చేస్తుంది.. షో ఆగిపోతుంది. అంతే! షో ఆగిపోవడం మీకు కావాలా? అంటూ ఎంతో హుందాగా ప్రశ్నించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ మొత్తం ఏక కంఠంతో ‘నో..’ అని ఆన్సర్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

దీంతో అదే ఉత్సాహంతో సునిధి షోని కంటిన్యూ చేసింది. ఈ షోకి సంబంధించిన ఫోటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘నా పార్టీలో మారున్నారా?’ అనే క్యాప్షన్‌తో ఫొటోలను షేర్‌ చేశారు. షోలో తనకు ఇలాంటి చేదు అనుభ‌వం ఎదురైనా ప‌ట్టించుకోకుండా షోను కొన‌సాగించిన సునిధి మంచిత‌నానికి నెటిజ‌న్లు సైతం ఫిదా అవుతున్నారు. ఇక సింగర్‌ సునిధి పాడిన ‘షీలా కీ జవానీ’, ‘కమ్లీ’, ‘క్రేజీ కియా రే’, ‘ఆజా నాచ్లే’, ‘బీడీ, ‘దేశీ గర్ల్’, ‘ధూమ్ మచాలే’ వంటి ఎన్నో పాటలు బంపర్‌ హిట్‌ కొట్టాయి.

మరిన్ని సినిమా సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.