Viral Video: ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో వైరల్

టాలీవుడ్‌ స్టార్ హీరో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మువీ 'పుష్ప' ఏ ముహూర్తాన విడుదలైందో గానీ.. నాటి నుంచి దేశ వ్యాప్తంగా పలు చోట్ల స్మంగ్లింగ్‌ ముఠాలు తీరొక్క రీతిలో స్మగ్లింగ్‌ గూడ్స్‌ దాచిపెడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. బంగారం, డ్రగ్స్‌, డబ్బు, మద్యం.. ఇలా అదీఇదని లేకుండా అక్రమరవాణాకు టాలెంట్‌ను ఓ రేంజ్‌లు వాడేస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్బుతో మభ్యపెట్టి, ఓటర్లను ఆకర్షించేందుకు..

Viral Video: ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో వైరల్
Hundred Liquor Bottles Recovered From Scooty
Follow us
Srilakshmi C

|

Updated on: May 03, 2024 | 4:45 PM

అమరావతి, మే 3: టాలీవుడ్‌ స్టార్ హీరో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మువీ ‘పుష్ప’ ఏ ముహూర్తాన విడుదలైందో గానీ.. నాటి నుంచి దేశ వ్యాప్తంగా పలు చోట్ల స్మంగ్లింగ్‌ ముఠాలు తీరొక్క రీతిలో స్మగ్లింగ్‌ గూడ్స్‌ దాచిపెడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. బంగారం, డ్రగ్స్‌, డబ్బు, మద్యం.. ఇలా అదీఇదని లేకుండా అక్రమరవాణాకు టాలెంట్‌ను ఓ రేంజ్‌లు వాడేస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్బుతో మభ్యపెట్టి, ఓటర్లను ఆకర్షించేందుకు.. పలు పార్టీల నేతలు నానాతిప్పలు పడుతున్నారు. సరైన పత్రాలు లేకుండా నేరుగా నగదు రవాణా చేస్తే పోలీసులు సీజ్‌ చేస్తున్నారని తమ మద్ధతుదారులతో వివిధ మార్గాల్లో నగదు, మద్యం వంటి తాయిలాలను చేరవేసేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పలుచోట్ల చిత్రవిచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి చొక్కాలోపల ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్‌లో ఏకంగా రూ.20 లక్షల నోట్ల కట్టలు, 25 తులాల బంగారాన్ని తరలిస్తూ టూ వీలర్‌పై విజయవాడకు వెళ్తుండగా ఖమ్మం జిల్లా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ విషయం మరువకముందే అచ్చం అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో గోపయ్య అనే వృద్ధుడు తన స్కూటీని మద్యం షాపుగా మార్చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని ఆంధ్రకు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇవి కూడా చదవండి

స్కూటీలో ఏకంగా వంద క్వార్టర్ల మద్యం సీసాలు దాచాడు. గోపయ్య వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో నందిగామ నగర శివారులో పోలీసులు అతడి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో తెలంగాణలో తయారైన మద్యం సీసాలు ఉన్నాయి. వీటిని కోదాడ నుంచి నందిగామకు తరలిస్తున్నట్లు గోపయ్య వెల్లడించాడు. దీంతో బైకుతో పాటు మద్యం సీసాలను కూడా పోలీసులు సీజ్‌ చేసి, కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.