Triple Talaq: కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కదులుతున్న రైలులో ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి షాకిచ్చాడు. భార్య నిరసన తెలపడంతో జుట్టు పట్టుకుని భార్యను కొట్టి, తర్వాత రైలు దూకి పారిపోయాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకోవడం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదు మేరకు భోగానిపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వరకట్న వేధింపులకు గురిచేసిన అత్తింటి వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాధితురాలు ఓ వీడియోను..
కాన్పూర్, మే 2: కదులుతున్న రైలులో ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి షాకిచ్చాడు. భార్య నిరసన తెలపడంతో జుట్టు పట్టుకుని భార్యను కొట్టి, తర్వాత రైలు దూకి పారిపోయాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకోవడం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదు మేరకు భోగానిపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వరకట్న వేధింపులకు గురిచేసిన అత్తింటి వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాధితురాలు ఓ వీడియోను విడుదల చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడితోసహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కొత్వాలి ప్రాంతంలోని పుఖ్రాయ పట్టణానికి చెందిన అర్షద్.. రాజస్థాన్‌లోని కోటాలో మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్నాడు. రాజస్థాన్‌లోని కోటాలో అతని ఆఫీస్ ఉన్నప్పటికీ గత కొంతకాలంగా భోపాల్‌లోని ఇంటి నుండి వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అర్షద్, బాధితురాలు మ్యాట్రిమోనియల్ సైట్‌లో కలుసుకున్నారు. ఈ ఏడాది జనవరి 12న పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత భర్త, అత్తమామలు తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని పోలీసులకు తెలిపింది. ఈ విషయమై తన అత్తను అడిగితే పెళ్లికి కట్నంగా ఏమీ తీసుకురానందుకు తనను అవమానించినట్లు తెలిపింది. అంతేకాకుండా అప్పటికే తన భర్తకు వివాహమైనట్లు తెలిపింది. భర్త తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. మొదటి పెళ్లి విషయాన్ని దాచి తనను మోసగించి రెండో పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల ఎదుట చెప్పి వాపోయింది. తనను మోసం చేసి వివాహం చేసుకోవడానికి అతని కుటుంబ సభ్యులందరూ పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెలిపింది.
విషయం పోలీసుల వరకు చేరడంతో రాజీ కుదిర్చే్ందుకు యత్నించారని తెలిపింది. ఈ క్రమంలో భార్యతో కలిసి భోపాల్ వెళ్లి బ్రతకాలని నిశ్చయించుకున్నారు. ఆ ప్రకారంగా తన భర్తతో కలిసి ట్రైన్‌లో భోపాల్‌కు వెళ్తుంది. జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఈ జంట సుమారు గంట తర్వాత అర్షద్ సామాన్లు తీసుకుని టాయిలెట్ వైపు వెళ్లడం చూసి అతన్ని ప్రశ్నించింది. తాను ఇంటికి వెళ్తున్నానని, ఇక తనతో ఉండబోనని చెప్పాడు. భార్య నిలదీయడంతో ఆమె జుట్టు పట్టుకుని దాడిచేసి, ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ చెప్పి రైలు దిగి పారిపోయాడు. దీంతో బాధితురాలికి స్వల్ప గాయాలు కాగా GRP ప్రథమ చికిత్స చేసి, తిరిగి కాన్పూర్‌లోని దేహత్‌కు పంపించారు. తనకు జరిగిన అన్యాయం గురించి బాధితురాలు భోగానిపూర్ పోలీస్ స్టేషన్‌లో భర్తతోపాటు అత్తింటి వారిపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏరియా అధికారి ప్రియ తెలిపారు.
మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.