Salman Khan House Firing Case: సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి ! కారణం ఇదే

బాలీవుడ్‌ అగ్రనటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై ఈ ఏడాది ఏప్రిల్ 14న ఇద్దరు అగంతకులు బైక్‌పై వెళ్తూ తుపాకీతో 4 రౌండ్ల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కొందరు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితులను విక్కీ, సాగర్ పాల్‌గా గుర్తించారు. విక్కీ, సాగర్‌తోపాటు వీరికి ఆయుధాలు సరఫరా చేసినట్లు అనుమానిస్తూ అనూజ్‌ తపన్‌ అనే వ్యక్తితోపాటు సోను సుభాష్ చందర్ మరొకరిని కూడా అరెస్ట్‌ చేసి..

Salman Khan House Firing Case: సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి ! కారణం ఇదే
Salman Khan House Firing Case
Follow us
Srilakshmi C

|

Updated on: May 01, 2024 | 5:26 PM

బాలీవుడ్‌ అగ్రనటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై ఈ ఏడాది ఏప్రిల్ 14న ఇద్దరు అగంతకులు బైక్‌పై వెళ్తూ తుపాకీతో 4 రౌండ్ల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కొందరు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితులను విక్కీ, సాగర్ పాల్‌గా గుర్తించారు. విక్కీ, సాగర్‌తోపాటు వీరికి ఆయుధాలు సరఫరా చేసినట్లు అనుమానిస్తూ అనూజ్‌ తపన్‌ అనే వ్యక్తితోపాటు సోను సుభాష్ చందర్ మరొకరిని కూడా అరెస్ట్‌ చేసి సోమవారం కోర్టు ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం సోనూ మినహా మిగతా అందరికీ పోలీస్‌ కస్టడీ విధించింది. అయితే ముంబయి పోలీసు కస్టడీలో ఉన్న అనూజ్‌ తపన్‌ బుధవారం మృతి చెంది కనిపించాడు. అతను బాత్‌రూంలో సూసైడ్‌ చేసుకుని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతుడు అనూజ్ థాపన్ (32)పై ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లకు ఆయుధాలు అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీస్‌ కస్టడీలో ఉన్న అనూజ్ థాపన్ బుధవారం ఉదయం బాత్రూంకి వెళ్లి బెడ్‌షీట్‌తో కిటికీకి ఉరిపెట్టుకుని కనిపించాడు. వెంటనే పోలీసులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. సంఘటన జరిగిన రోజు తెల్లవారుజామున 4.51 గంటల ప్రాంతంలో తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పులు జరిపిన సమయంలో సల్మాన్ ఖాన్ తన ఇంట్లో ఉన్నాడు. ఈ ఘటన తర్వాత ఇద్దరు షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లను ముంబై పోలీసులు గుజరాత్‌లోని భుజ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో థాపన్, చందర్‌ల పేర్లు పోలీసులకు తెలిపారు. దీంతో ఏప్రిల్ 25న పంజాబ్‌కు చెందిన మరో నిందితుడు సోను సుభాష్ చందర్ (37)తో పాటు థాపన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులందరిపై ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) ప్రయోగించారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టైన నలుగురు నిందితులు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యులని పోలీసులు తెలిపారు. సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడింది తామేనంటూ లారెన్స్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనూ సల్మాన్‌పై ఈ గ్యాంగ్‌ పలుమార్లు బెదిరింపులకు పాల్పడటంతో మహారాష్ట్ర సర్కార్‌ వై ప్లస్‌ భద్రత కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథానల కోసం క్లిక్‌ చేయండి.