TS SSC Supplementary Exam 2024: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఇదే!

TS 10th Class Result 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు సోమవారం (ఏప్రిల్‌ 30) ఉదయం విద్యాశాఖ సెక్రటరి బుర్రా వెంకటేశం విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. వారిలో 4,94,207 రెగ్యులర్ విద్యార్ధులు, 11,606 ప్రైవేట్ విద్యార్దులు ఉన్నారు. వీరిలో 4,51,272 (91.31 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులతోపాటు..

TS SSC Supplementary Exam 2024: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఇదే!
TS SSC Supplementary Exams 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 30, 2024 | 3:06 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30: తెలంగాణ పదో తరగతి ఫలితాలు సోమవారం (ఏప్రిల్‌ 30) ఉదయం విద్యాశాఖ సెక్రటరి బుర్రా వెంకటేశం విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. వారిలో 4,94,207 రెగ్యులర్ విద్యార్ధులు, 11,606 ప్రైవేట్ విద్యార్దులు ఉన్నారు. వీరిలో 4,51,272 (91.31 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులతోపాటు తక్కువ మార్కులు వచ్చిన వారు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా తెలంగాణ పదో తరగతి డ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. జూన్‌ 3 నుంచి 13 వరకు పదో తరగతి డ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మే 16తో ఫీజు చెల్లింపులు ముగుస్తాయి. అలాగే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు.. ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 15 రోజుల వరకు (మే 15 వరకు) జరుగుతుంది. రీ కౌంటింగ్‌కు ఒక్కోసబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. రీవెరిఫికేషన్‌ కోసం రూ.1000 చెల్లించాలి.

ఫెయిల్‌ అయిన విద్యార్ధులందరూ రీ కౌటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ఫలితాల కోసం ఎదురు చూడకుండా 2024 జూన్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించి, పరీక్షలకు హాజరుకావాలని, ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని పాఠశాల విద్యాశాఖ విద్యార్ధులకు సూచించింది. విద్యార్ధులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మాత్రమే ఫీజు చెల్లించాలి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?