TS 10th Class 2024 Toppers List: తెలంగాణ ‘పది’ ఫలితాల్లో సత్తా చాటిన నిర్మల్ జిల్లా.. అత్యల్ప ఉత్తీర్ణత ఏ జిల్లాకు వచ్చిందంటే
తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేట్ విద్యార్ధుల్లో 49.73 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 99.05 శాతం అధిక ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అదే విధంగా రాష్ట్రంలోని అతి తక్కువ ఉత్తీర్ణత శాతం వికారాబాద్ జిల్లాలో నమోదైంది. ఈ జిల్లాలో65.10 శాతం మాత్రమే టెన్త్..
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేట్ విద్యార్ధుల్లో 49.73 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 99.05 శాతం అధిక ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అదే విధంగా రాష్ట్రంలోని అతి తక్కువ ఉత్తీర్ణత శాతం వికారాబాద్ జిల్లాలో నమోదైంది. ఈ జిల్లాలో65.10 శాతం మాత్రమే టెన్త్ విద్యార్ధులు ఉత్తీర్ణత పొందారు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత చూస్తే..
- ఫస్ట్ ల్యాంగ్వేజ్‌లో 4,79,634 మంది అంటే 97.12 శాతం ఉత్తీర్ణత పొందారు.
- సెకండ్ ల్యాంగ్వేజ్‌లో 4,92,665 మంది అంటే 99.87 శాతం ఉత్తీర్ణత పొందారు.
- థార్డ్ ల్యాంగ్వేజ్‌లో 4,85,016 మంది అంటే 98.30 శాతం ఉత్తీర్ణత పొందారు.
- మ్యాథమెటిక్స్‌లో 4,76,513 మంది అంటే 96.46 శాతం ఉత్తీర్ణత పొందారు.
- సైన్స్ సబ్జెక్ట్‌లో 4,77,255 మంది అంటే 96.60 శాతం ఉత్తీర్ణత పొందారు.
- సోషల్ స్టడీస్‌లో 4,89,276 మంది అంటే 99.05 శాతం ఉత్తీర్ణత పొందారు.
మ్యాథమెటిక్స్‌లో 96.46 శాతం, జనరల్ సైన్స్‌లో 96.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి 5 శాతం మ్యాథమెటిక్స్‌లో అధికంగా ఉత్తీర్ణత వచ్చింది.
తెలుగు మీడియంలో 80.71 శాతం, ఇంగ్లిష్ మీడియంలో 93.74 శాతం, ఉర్దూ మీడియంలో 81.50 శాతం, ఇతర మీడియంలలో 88.47 శాతం ఉత్తీర్ణత పొందారు. మొత్తంగా 91.31 శాతం రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి విద్యార్ధులు ఉత్తీర్ణత పొందారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.