Doctor Family: విజయవాడలో డాక్టర్‌ ఫ్యామిలీ మూకుమ్మడి సూసైడ్.. ఇద్దరు చిన్నారులతో సహా కుటుంబం మొత్తం గొంతు కోసుకుని..!

ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు గానీ.. ఓ డాక్టర్‌ తనతోపాటు మొత్తం కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడ్డడం కలకలం రేపింది. మృతుల్లో భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ దారుణ ఘటన విజయవాడలోని గురునానక్ నగర్‌లో మంగళవారం (ఏప్రిల్‌ 30) వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. సిటీలోని గురునానక్ నగర్‌ నివాసముంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ (40) కుటుంబ సభ్యులను హత్య చేసి అనతరం ఆత్మహత్య చేసుకున్నట్టు..

Doctor Family: విజయవాడలో డాక్టర్‌ ఫ్యామిలీ మూకుమ్మడి సూసైడ్.. ఇద్దరు చిన్నారులతో సహా కుటుంబం మొత్తం గొంతు కోసుకుని..!
Vijayawada Doctor Family Suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 30, 2024 | 3:00 PM

విజయవాడ, ఏప్రిల్‌ 30: ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు గానీ.. ఓ డాక్టర్‌ తనతోపాటు మొత్తం కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడ్డడం కలకలం రేపింది. మృతుల్లో భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ దారుణ ఘటన విజయవాడలోని గురునానక్ నగర్‌లో మంగళవారం (ఏప్రిల్‌ 30) వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. సిటీలోని గురునానక్ నగర్‌ నివాసముంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ (40) కుటుంబ సభ్యులను హత్య చేసి అనతరం ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనలో డాక్టర్‌ శ్రీనివాస్‌తోపాటు ఆయన భార్య ఉష (38) , ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్‌ (8), తల్లి రమణమ్మ (65) మరణించారు. ఆత్మహత్యకు ముందు డాక్టర్ శ్రీనివాస్ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం వారి పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా.. బాల్కనీలో డాక్టర్‌ శ్రీనివాస్‌ ఉరివేసుకుని కనిపించారు. భయభ్రాంతులకు గురైన ఆమె వెంటనే కేకలు వేస్తూ చుట్టు పక్కల వారిని పిలిచింది. అనంతరం పోలీసులకు కూడా సమాచారం అందించారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీస్ కమిషనర్ రామకృష్ణ అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఇంటి లోపల శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులందరి గొంతులు కోసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్‌ కుటుంబం డెత్‌ కేసు ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టారు.

కాగా 1996 ఎంబీబీఏస్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబిబిఏస్ చదివారు. ఏడాది క్రితం డాక్టర్‌ శ్రీనివాస్‌ శ్రీజ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆయితే ఆసుపత్రి కారణంగా గత కొంతకాలంగా ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి సరిగా నడవటం లేదని ఆందోళనతో శ్రీనివాస్ డిప్రెషన్‌కు గురయ్యారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఆసుపత్రిని వేరే వారికి అప్పగించారు. ఆసుపత్రి వల్ల నష్టపోయినట్లు తెలుసు తప్ప.. డిప్రెషన్ లో ఉన్నట్టు తెలియదని తెలిస్తే సాయం చేసే వాళ్ళమని శ్రీనివాస్ క్లాస్ మెట్స్ డాక్టర్లు భగవాన్, డాక్టర్ మాధవి ఆవేదన చెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!