AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dam Collapsed in Kenya: కెన్యాలో భారీ వర్షాలు.. డ్యామ్ కూలి 40 మంది మృతి! నిరాశ్రయులైన లక్షలాది అభాగ్యులు

ఆఫ్రికా దేశంలోని పశ్చిమ కెన్యాలో సోమవారం (ఏప్రిల్‌ 29) ఘోర ప్రమాదం చోటు చేసుకంది. సోమవారం తెల్లవారుజామున ఉన్నట్టుంది భారీ డ్యామ్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. డ్యామ్‌ నీరు ఒక్కసారిగా ఇళ్లలోకి చొచ్చుకురావడంతో ప్రాణనష్టం సంభవించింది. రిఫ్ట్‌ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌ కూలడంతో నీటి ఉద్ధృతి..

Dam Collapsed in Kenya: కెన్యాలో భారీ వర్షాలు.. డ్యామ్ కూలి 40 మంది మృతి! నిరాశ్రయులైన లక్షలాది అభాగ్యులు
Dam Collapsed In Kenya
Srilakshmi C
|

Updated on: Apr 29, 2024 | 4:52 PM

Share

నైరోబి, ఏప్రిల్‌ 29: ఆఫ్రికా దేశంలోని పశ్చిమ కెన్యాలో సోమవారం (ఏప్రిల్‌ 29) ఘోర ప్రమాదం చోటు చేసుకంది. సోమవారం తెల్లవారుజామున ఉన్నట్టుంది భారీ డ్యామ్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. డ్యామ్‌ నీరు ఒక్కసారిగా ఇళ్లలోకి చొచ్చుకురావడంతో ప్రాణనష్టం సంభవించింది. రిఫ్ట్‌ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌ కూలడంతో నీటి ఉద్ధృతి పెరిగి గోడలు కొట్టుకుపోయాయి. దీంతో దిగువ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇళ్లు నీటమునగడంతో ప్రధాన రహదారి ధ్వంసమైంది. ఆకస్మిక వరద కారణంగా కొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కాగా కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల వల్ల ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. అక్కడి స్కూళ్లు, కాలేజీలను కూడా మూసివేశారు. ఈ ఏడాడి మార్చి నెల మధ్య నుంచి ఆ దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా మరింత వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో భారీగా వరదలు ముంచెత్తాయి. టాంజానియాలో 155 మంది మృతి చెందగా… దానికి పొరుగున ఉన్న బురుండిలో 2 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. దీంతో వరద బాధితులు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు కెన్నా ఎయిర్‌పోర్టు కూడా శనివారం వరద నీటితో నిండిపోయింది. దీంతో కొన్ని విమానాలను దారి మళ్లించవలసి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే, టెర్మినల్స్, కార్గో ప్రాంతమంతా వరద నీటితో నిండిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వరద బాధితులను తాత్కాలిక శిబిరాలకు తరలించాలని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.