Rat Czar: అమెరికాలో ఎలుకలు పట్టే కొలువు.. జీతం ఏడాదికి రూ. 1.2 కోట్లు !
న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ఎలుకల సమస్యతో బాధపడుతున్నాయి. సబ్ వేలు, డ్రైనేజ్‌లు, పార్కులు ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఎలుకలు కనిపిస్తున్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోవడం ఇటీవల వార్తల్లోకి వచ్చింది కూడా. ఈ క్రమంలోనే న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ‘ర్యాట్ క్యాచర్’ను నియమించారు. ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ పేరిట ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు.
న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ఎలుకల సమస్యతో బాధపడుతున్నాయి. సబ్ వేలు, డ్రైనేజ్‌లు, పార్కులు ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఎలుకలు కనిపిస్తున్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోవడం ఇటీవల వార్తల్లోకి వచ్చింది కూడా. ఈ క్రమంలోనే న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ‘ర్యాట్ క్యాచర్’ను నియమించారు. ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ పేరిట ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 900 మంది అప్లై చేసుకోగా.. వారిలో కేథలిన్ కొరాడీని ఎంపిక చేశారు. ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేసిన ఆమె.. విద్యా శాఖలో ఎలుకల నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వంటి అంశాలపై చిన్నపాటి రీసెర్చ్ చేశారట. ఇప్పుడు ఆమె చేయాల్సిన పనేమిటంటే.. ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలుకలకు దొరక్కుండా డిస్పోస్ చేయడం, వాటి సంతతి తగ్గిపోయేలా చర్యలు తీసుకోవడం, సబ్ వేలలో ఎలుకలు ఆవాసం ఏర్పాటు చేసుకోకుండా చేయడమేనని ఆమె అన్నారు. విష పదార్థాలు పెట్టి ఎలుకలను చంపకూడదన్న రూల్ ఉండటంతో ఆమె ఎలా కట్టడి చేస్తారో అన్న చర్చ మొదలైంది. ఇంతకుముందు అలా చేస్తే.. ఆ విష పదార్థాలను తిని ఎలుకలు చనిపోయాయి. అలా చనిపోయిన ఎలుకలను తిని ఇతర జంతువులు, పక్షులు చనిపోయాయట. అందుకే విషం పెట్టొద్దన్న రూల్ పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

