Vande Bharat Metro: త్వరలో పరుగులు పెట్టనున్న వందే మెట్రో రైళ్లు.!

సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేసింది. నగరాల్లో ప్రజారవాణా అవసరాలు తీర్చేలా వందే మెట్రో రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జూలై నుంచి ప్రయోగాత్మకంగా వందే మెట్రో రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు.

Vande Bharat Metro: త్వరలో పరుగులు పెట్టనున్న వందే మెట్రో రైళ్లు.!

|

Updated on: Apr 29, 2024 | 10:53 PM

సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేసింది. నగరాల్లో ప్రజారవాణా అవసరాలు తీర్చేలా వందే మెట్రో రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జూలై నుంచి ప్రయోగాత్మకంగా వందే మెట్రో రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరలో ప్రజలు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ అధికారి తెలిపారు.

వేగంగా వెళ్లడంతో పాటు వెంటనే ఆగేందుకు నూతన టెక్నాలజీని ఇండియన్ రైల్వే స్ ఈ రైళ్లలో వినియోగించనుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్ లలో ఆగేందుకు వీలవుతుంది. నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వందే మెట్రోలలో ఎన్నో కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఈ ఏడాదే ఈ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారి చెప్పారు. జులై నుంచి ఈ రైళ్ల పరీక్షలు మొదలవుతాయనీ ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లలో లేని సదుపాయాలు వందే మెట్రోలలో ఉంటాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను అతి త్వరలో ప్రజల ముందుంచుతాం అని ఆ ఉన్నతాధికారి వివరించారు. అలాగే ఏ నగరంలో ముందుగా వందే మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

రైల్వే శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వందే మెట్రోలో బోగీల ఏర్పాటు ప్రత్యేకంగా ఉండనుంది. నాలుగేసి కోచ్ లను ఒక యూనిట్ గా పరిగణిస్తారు. కనీసం 12 కోచ్ లతో ఒక వందే మెట్రో ఉండనుంది. ఆయా రూట్లలో డిమాండ్ ను బట్టి కోచ్ ల సంఖ్యను 16కు పెంచుతారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం విషయంలో లోటుండదు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం విషయంలో లోటుండదు..
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం