Amazon: అమెజాన్‌ రిటర్న్‌ బాక్స్‌లో పెంపుడు పిల్లి.! ఆరు రోజుల తర్వాత..?

Amazon: అమెజాన్‌ రిటర్న్‌ బాక్స్‌లో పెంపుడు పిల్లి.! ఆరు రోజుల తర్వాత..?

Anil kumar poka

|

Updated on: Apr 30, 2024 | 9:01 AM

అమెజాన్ లో కొన్న వస్తువు నచ్చకపోవడంతో వాపస్ పంపించేందుకు ప్యాక్ చేశారా దంపతులు.. కొరియర్ కంపెనీలో ఆ బాక్స్ ఇచ్చేసి ఆఫీసులకు వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక ప్రేమగా ఎదురొచ్చే పెంపుడు పిల్లి కనిపించలేదు. ఇంట్లో, చుట్టుపక్కల వాళ్ల ఇళ్లల్లో వెతికినా దొరకలేదు. పిల్లి కనిపించట్లేదని పోస్టర్లు అంటించి మరీ గాలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే,

అమెజాన్ లో కొన్న వస్తువు నచ్చకపోవడంతో వాపస్ పంపించేందుకు ప్యాక్ చేశారా దంపతులు.. కొరియర్ కంపెనీలో ఆ బాక్స్ ఇచ్చేసి ఆఫీసులకు వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక ప్రేమగా ఎదురొచ్చే పెంపుడు పిల్లి కనిపించలేదు. ఇంట్లో, చుట్టుపక్కల వాళ్ల ఇళ్లల్లో వెతికినా దొరకలేదు. పిల్లి కనిపించట్లేదని పోస్టర్లు అంటించి మరీ గాలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, ఆరు రోజుల తర్వాత తమ పిల్లికి అమర్చిన మైక్రో చిప్ స్కాన్ చేసినట్లు ఆ దంపతుల మొబైల్ కు నోటిఫికేషన్ వచ్చింది. అదే రోజు సాయంత్రం ఓ వెటర్నరీ డాక్టర్ ఫోన్ చేసి పిల్లి తన దగ్గర క్షేమంగా ఉందని చెప్పారు. అమెజాన్ కు రిటర్న్ పంపించిన బాక్స్ లో పొరపాటున పిల్లి కూడా వెళ్లిందని తెలిసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. ఆరు రోజుల పాటు తిండి, నీళ్లు లేకున్నా అది ప్రాణాలతో ఉండడంపై వెటర్నరీ డాక్టర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అమెజాన్ లో డెలివరీ అందుకున్న ఓ వస్తువును క్యారీ క్లార్క్ అనే మహిళ వాపస్ చేసింది. సదరు వస్తువు పనితీరు బాలేదని చెబుతూ రిటర్న్ పంపించింది. అయితే, భర్తతో కలిసి దానిని ప్యాక్ చేస్తూ లోపల పడుకున్న పిల్లిని గుర్తించలేదు. దీంతో ఆ పిల్లి కూడా బాక్స్ తో పాటే వెళ్లిపోయింది. ఆరు రోజుల ప్రయాణం తర్వాత యుటా నుంచి కాలిఫోర్నియాలోని అమెజాన్ గోడౌన్ కు చేరింది. బాక్స్ విప్పిన ఓ ఉద్యోగి అందులో నీరసంగా పడుకున్న పిల్లిని గుర్తించి హుటాహుటిన వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇదిలా ఉండగా.. అక్కడ యుటాలోని దంపతులు తమ పెంపుడు పిల్లి కనిపించక ఇంటా బయటా తీవ్రంగా వెతికారు. పోస్టర్లు అంటిస్తూ వీధులన్నీ గాలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.