MH370 Flight: MH370 విమానం మిస్సింగ్‌లో ఏలియెన్స్ ఆధారాలు.?
ఏలియన్స్ విషయం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. గుర్తు తెలియని పళ్లాల్లాంటివి ఆకాశంలో ఎగురుతున్నట్లుగా చెబుతూ కొన్ని వీడియోలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అలా వచ్చిన ప్రతిసారీ దీనిపై చర్చ జరుగుతుంటుంది. 2014లో హఠాత్తుగా కనిపించకుండా పోయిన ఎంహెచ్370 విమానానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరలైంది.
ఏలియన్స్ విషయం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. గుర్తు తెలియని పళ్లాల్లాంటివి ఆకాశంలో ఎగురుతున్నట్లుగా చెబుతూ కొన్ని వీడియోలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అలా వచ్చిన ప్రతిసారీ దీనిపై చర్చ జరుగుతుంటుంది. 2014లో హఠాత్తుగా కనిపించకుండా పోయిన ఎంహెచ్370 విమానానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరలైంది. దాంట్లో ఒక గుండ్రటి వస్తువు విమానం చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు కనిపించింది. అయితే, అది నిజమైన వీడియో కాదని.. ఎడిట్ చేశారని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
2014లో ఎంహెచ్370 కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరింది. 227 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన 38 నిమిషాల తర్వాత ఆ విమానం కనిపించకుండా పోయింది. తర్వాత ఓ గంట పాటు మిలిటరీ రాడార్లలో దాని ఆనవాళ్లు కనిపించాయి. నిర్దేశిత మార్గంలో కాకుండా మాలే ద్వీపం, అండమాన్ సముద్రాన్ని దాటేసి వెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత దాని జాడ ఇప్పటి వరకు కనిపించలేదు. ఆధునిక విమానయాన చరిత్రలో ఇదో పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. అందులో ఒకటి ఏలియెన్స్ థియరీ.
ఈ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ ఓ యూజర్ స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అభిప్రాయాన్ని కోరాడు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. తాను ఇప్పటి వరకు ఏలియెన్స్‌కు సంబంధించిన ఆధారాలను చూడలేదనీ ఒకవేళ తన దృష్టికి వస్తే వెంటనే ఆ వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తాననీ అన్నారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన దాదాపు 6,000 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయనీ వీటిలో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు ఏలియెన్స్‌ను ఎదుర్కొన్న సందర్భాలు లేవని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.