Leopard: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత.. ప్రహరీ దూకుతుండగా వైర్లకు తగిలిన చిరుత.

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని తెలుసుకున్న విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ విభాగం సిబ్బంది ఇంకా జూ అధికారులు చిరుత కోసం పరిసర ప్రాంతాల్లో వెదుకుతున్నారు.

Leopard: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత.. ప్రహరీ దూకుతుండగా వైర్లకు తగిలిన చిరుత.

|

Updated on: Apr 30, 2024 | 9:11 AM

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని తెలుసుకున్న విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ విభాగం సిబ్బంది ఇంకా జూ అధికారులు చిరుత కోసం పరిసర ప్రాంతాల్లో వెదుకుతున్నారు. ఆదివారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.

ఆదివారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి అది దూకినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్టు కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగింది. దీంతో అక్కడి భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరించినట్లు తేలింది. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లోకి చేరుకున్న అటవీ సిబ్బంది.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టేందుకు బోన్లు ఏర్పాటు చేశారు ఎయిర్ పోర్ట్ లో నిఘా కోసం సీసీ కెమెరాలు ఫిక్స్‌ చేశారు. చిరుత సంచార వార్త తెలిసిన విమానాశ్రయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us