Israel - Hamas: ఎర్ర సముద్రంలో చమురు నౌకపై హౌతీల దాడి..

Israel – Hamas: ఎర్ర సముద్రంలో చమురు నౌకపై హౌతీల దాడి..

Anil kumar poka

|

Updated on: Apr 30, 2024 | 9:15 AM

ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో హమాస్‌కు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నహౌతీ తిరుగుబాటుదారులు తాజాగా మరో నౌకపై దాడి చేశారు. భారత్‌కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే ఆయిల్‌ ట్యాంకర్‌పై హౌతీ రెబల్స్‌ క్షిపణితో దాడి చేశారు. ఈ విషయాన్ని హౌతీ తిరుగుబాటుదారులే ప్రకటించారు.

ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో హమాస్‌కు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నహౌతీ తిరుగుబాటుదారులు తాజాగా మరో నౌకపై దాడి చేశారు. భారత్‌కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే ఆయిల్‌ ట్యాంకర్‌పై హౌతీ రెబల్స్‌ క్షిపణితో దాడి చేశారు. ఈ విషయాన్ని హౌతీ తిరుగుబాటుదారులే ప్రకటించారు. పనామా జెండా ఉన్న నౌకపై దాడి చేసినట్లు హౌతీ ప్రతినిధి యాహ్యా సరియా తెలిపారు. ఈ దాడిలో నౌకకు నష్టం వాటిల్లినట్లు బ్రిటిష్‌ సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే తెలిపింది. ఈ నౌక రష్యాలోని ప్రిమోర్క్‌ నుంచి గుజరాత్‌లోని వడినార్‌కు వెళ్తుండగా దాడి జరిగినట్లు ఆంబ్రే తెలిపింది.

మరో వైపు గాజాలోని రఫాపై దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్‌ తెలిపింది. దీన్ని తాము పరిశీలిస్తున్నామని, త్వరలోనే స్పందన తెలుపుతామని శనివారం పేర్కొంది. ఇజ్రాయెల్‌ ప్రతిపాదనలోని అంశాలను మాత్రం హమాస్‌ సీనియర్‌ నేత ఖలీల్‌ అల్‌ హయ్యా వెల్లడించలేదు. ఏప్రిల్‌ 13న ఈజిప్టులో జరిగిన చర్చల్లో 40 మంది ఇజ్రాయెలీ బందీల విడుదల, ఇందుకు ప్రతిగా వందలాది మంది పాలస్తీనియన్‌ ఖైదీలను విడిచే పెట్టే అంశం తెరపైకి వచ్చింది. తాజా ప్రతిపాదనలో బందీల సంఖ్య 33కి తగ్గిందన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గాజాపై ఇజ్రాయెల్‌ దాడికి వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు సంఘీభావంగా ప్రొఫెసర్లు ర్యాలీల్లో పాల్గొంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.