Masala Dosa: ‘ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా’ ఆపరేషన్ మధ్యలో ఆపేసి వెళ్లిపోయిన వైద్యుడు!
వైద్య వృత్తికి మచ్చతెచ్చేలా ఉంది ఈ వైద్యుడి ప్రవర్తన. ఆపరేషన్ థియేటర్‌లో ఓ రోగికి సర్జరీ చేస్తూ.. ఆకలి వేస్తోందని ఆపరేషన్ మధ్యలో నిర్లక్ష్యంగా ఆపేసి.. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు. దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి సర్జరీ పూర్తి చేశాడు. సర్జరీ తర్వాత కూడా పూర్తిగా నయం కాకపోవడంతో రోగి వైద్యుడి చుట్టూ తిరిగాడే.. ఫలితం లేకపోవడంతో మరో వైద్యుడిని సంప్రదించాడు..
ఝాన్సి, ఏప్రిల్ 28: వైద్య వృత్తికి మచ్చతెచ్చేలా ఉంది ఈ వైద్యుడి ప్రవర్తన. ఆపరేషన్ థియేటర్‌లో ఓ రోగికి సర్జరీ చేస్తూ.. ఆకలి వేస్తోందని ఆపరేషన్ మధ్యలో నిర్లక్ష్యంగా ఆపేసి.. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు. దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి సర్జరీ పూర్తి చేశాడు. సర్జరీ తర్వాత కూడా పూర్తిగా నయం కాకపోవడంతో రోగి వైద్యుడి చుట్టూ తిరిగాడే.. ఫలితం లేకపోవడంతో మరో వైద్యుడిని సంప్రదించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగు చూసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో జిల్లా నవాబాద్ ప్రాంతానికి చెందిన కాజల్ శర్మ అనే బాలిక ఆడుకుంటూ ఇంట్లో పడిపోయింది. దీంతో ఎడమ మోచేతి ఎముక విరిగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన ఓ ఆర్థోపెడిక్ సర్జన్ బాలిక చేతికి సర్జరీ చేయాలని సూచించాడు. ఈ సంఘటన గతేడాది డిసెంబర్ 22న జరిగింది. అదేరోజు శస్త్రచికిత్స చేసేందుకు బాలికను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్ మొదలు పెట్టిన కాసేపటికే ఆకలిగా ఉందని, మసాలా దోశ తిని వచ్చి సర్జరీ పూర్తి చేస్తానని చెప్పి మధ్యలోనే వైద్యుడు వెళ్లిపోయాడు.
అలా వెళ్లిపోయిన వైద్యుడు దాదాపు 2 గంటల తర్వాత తిరిగి వచ్చి ఆపరేషన్ పూర్తి చేశాడు. అయినప్పటికీ బాలిక చెయ్యి నయం కాలేదు. వేళ్లు కూడా వంకరగా మారడంతో బాలిక కుటుంబ సభ్యులు మళ్లీ ఆ వైద్యుడిని కలిసేందుకు ఆసుపత్రికి వస్తే.. వారిని కలిసేందుకు వైద్యుడు నిరాకరించాడు. దీంతో చేసేదిలేక ఆ బాలిక మరో ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవల్సి వచ్చింది.
దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై నవాబాద్ పోలీస్‌స్టేషన్‌లో వైద్యుడిపై ఫిర్యాదు చేయగా.. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. దీంతో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకుంటామని మీడియాకు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.